Share News

పులివెందుల అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:04 AM

పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహ కరించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కోరారు.

పులివెందుల అభివృద్ధికి సహకరించండి
మంత్రికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

మున్సిపల్‌ శాఖా మంత్రిని కోరిన ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

పులివెందుల టౌన, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహ కరించాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణను కలిసి పులివెందుల సమస్యలను వివరించారు. ము న్సిపాలిటీలో అనేక ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2019-24 మధ్యకాలంలో ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మె ల్యేనే ముఖ్యమంత్రిగా ఉన్నా సరైన అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు మంజూరు చేసినా పను లు చేయడంలో యంత్రాంగం పూర్తిగా వైఫ ల్యం చెందిందన్నారు. అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. కొన్ని ప్రారంభం కూడా కాలేదన్నారు. పులివెందుల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి అత్యవసరంగా రూ.ఐదు కోట్ల నిధులు మం జూరు చేయాలని కోరారు.

Updated Date - Dec 24 , 2024 | 12:04 AM