Share News

తూతూ మంత్రంగా కౌన్సిల్‌ సమావేశం

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:35 PM

జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ. 2లక్షలకు పైగా ప్రజలు, బోలెడన్ని సమస్యలున్నా తూతూ మంత్రంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తూతూ మంత్రంగా కౌన్సిల్‌ సమావేశం
టీడీపీ కౌన్సిలర్‌ తులసి మాట్లాడుతుండగా సమావేశం నుంచి లేచి వెళ్లిపోతున్న చైర్‌పర్సన మనూజ

ప్రజా సమస్యలు చర్చించకుండానే ముగిసిన మున్సిపల్‌ మీట్‌ వైసీపీ కౌన్సిలర్ల ఏకపక్ష నిర్ణయంతో సర్వత్రా విస్మయం

మదనపల్లె టౌన, సెప్టెంబరు 28: జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ. 2లక్షలకు పైగా ప్రజలు, బోలెడన్ని సమస్యలున్నా తూతూ మంత్రంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 35 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు నెలకు ఒకసారి సమావేశమై పరిష్కార మార్గాలు చర్చించాల్సింది పోయి ఇవేమి పట్టనట్లు కేవలం 20 నిమిషా ల్లోనే సమావేశం ముగిసినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన బెల్‌ మోగించ డం పట్టణ ప్రజలు విస్తుపోయారు. మదనపల్లెలో గత నెల మున్సిపల్‌ సమావేశాన్నే నిర్వహించలేదు. కనీసం ఈనెల అయినా కౌన్సిల్‌ సమావే శంలో ప్రజాసమస్యలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటార నుకుంటే అదికూడా లేకుండా సమావేశం ముగించి టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టినా వినకుండా కౌన్సిల్‌ హాల్లో నుంచి వెళ్లిపోవడం చూస్తే వీళ్లేనా ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నది అంటూ పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో ఉదయం 11గంటలకు సమావేశం 31 అంశాలతో కూడిన అజెండా కాపీ లను మున్సిపల్‌ చైర్‌పర్సన మనూజ కౌన్సిలర్లకు పంపారు. ఈ క్రమంలో కౌన్సిల్‌హాల్లోకి కౌన్సిలర్లు చేరగానే సమావేశం ప్రారంభించగా ముందుగా మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా చలపతి మాట్లాడుతూ విజయవాడలో ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన వరదల్లో మృతి చెందిన వారి కుటుంబీ కులకు సంతాపం తెలియజేయాల్సిందిగా కోరారు. ఇంతలో కౌన్సిలర్‌ కరీముల్లా మాట్లాడుతూ తన వార్డులో మురుగునీటి కాలువ మరమ్మ తులకు గత కౌన్సిల్‌లో నిర్ణయం ఆమోదం తీసుకున్నా ఇంత వరకు పనులు పూర్తి చేయలేదన్నారు. విజయవాడ వరద బాధితుల సహా యార్థం ఎమ్మెల్యే షాజహానబాషా నాలుగు లారీ సరుకులు సేకరించి విజయవాడకు వెళ్లి పంచారన్నారు. ఈ క్రమంలో 6వ వార్డు కౌన్సిలర్‌ ప్రసాదబాబు లేచి అజెండాలోని అన్ని అంశాలకు తామందరం ఆమో దం తెలుపుతున్నామని ప్రకటించారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన మనూజ సమావేశం ముగిసినట్లు బెల్‌ మోగించారు. టీడీపీ కౌన్సిలర్‌ తులసి మైక్‌ తీసుకుని మాట్లాడుతుండగానే చైర్‌పర్సన అధ్యక్షస్థానం దిగి వెళ్లిపోయారు. దీనిపై టీడీపీకి మద్దతిస్తున్న కౌన్సిలర్‌ నాగార్జున బాబు మాట్లాడుతూ విజయవాడ వరదబాఽధితులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు నిద్రాహారాలు మాని శ్రమిస్తుంటే మాజీ సీఎం జగన వెకిలినవ్వులు రివ్వుతూ ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. అలాంటి వైసీపీ నాయకులు ఇక్కడ వరద మృతులకు సంతాపం ప్రకటించడం బాధకరమన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నారన్న ధీమాతో వైసీపీ కౌన్సి లర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులు చర్చించాల్సింది పోయి, కేవలం వారి స్వార్థానికే మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ‘మమ’ అన్న రీతిలో ముగించారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Sep 28 , 2024 | 11:35 PM