ప్రతిభకు పట్టం కట్టడం అభినందనీయం : మూల
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:28 PM
రంగస్థల నటుడిగా, లఘుచిత్ర దర్శనకుడిగా ప్రతిభను చాటి నటీనటులను, దర్శకులను, కెమెరా మెన్లను గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఏవీఎస్ రాజు కు నటకళాతపస్వి పురస్కారాన్ని ఇచ్చి ప్రతిభకు పట్టం కట్టడం అభినందనీయమని రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆచార్య మూలమల్లిఖార్జునరెడ్డి అన్నారు.
కడప నాగరాజుపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రంగస్థల నటుడిగా, లఘుచిత్ర దర్శనకుడిగా ప్రతిభను చాటి నటీనటులను, దర్శకులను, కెమెరా మెన్లను గాయకులను కళారంగానికి పరిచయం చేసిన ఏవీఎస్ రాజు కు నటకళాతపస్వి పురస్కారాన్ని ఇచ్చి ప్రతిభకు పట్టం కట్టడం అభినందనీయమని రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆచార్య మూలమల్లిఖార్జునరెడ్డి అన్నారు. ఆదివారం కడపలోని పెన్షనర్స్ కార్యాలయంలో మహాకవయిత్రి మొల్ల సాహితీ పీఠం, శ్రీ భాగ్యరత్న ఫౌండేషన వారు ఏవీఎస్ రాజుకు నటకళాతపస్వి పురస్కారం ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మూల మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ 1987 నుంచి లఘు చిత్రదర్శనకుడిగా రాజు ఎన్నో లఘుచిత్రాలు తీశారన్నారు. సభాధ్యక్షుడు విద్వాన గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ రాజు గూడూరు సావిత్రి, ఈమని శివనాగిరెడ్డి, కమ్ము సోదరులు, బుర్ర సుబ్రమణ్య శాస్ర్తి తదతర ఉద్దండుల సరసన నటించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం పూర్వసభ్యుడు డాక్టర్ తవ్వ వెంకటయ్య మాట్లాడుతూ రాజు రంగస్థల నటుడిగా కాకుండా సినిమాల్లో కూడా నటించడం గర్వించదగ్గ విషయమన్నారు. కవి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరచారి రాజుపై నవరత్నాలు అనే పేరుతో పద్యాలు రాసి ఆలపించారు. పసుపులేటి గోపినాథ్, యూపీ రాయుడు, యడవల్లి భాస్కర్‌వర్మ రాజు కళావైభవాన్ని కొనియాడారు. సంస్థ వారు రాజును శాలువా, పూలమాల ప్రశంసాపత్రం, సర్టిఫికెట్, 10వేలు నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు.స్వరూపరాణి సభ నిర్వహించారు. కార్యక్రమంలో సాహితీమిత్రులు, కళాకారులు పాల్గొన్నారు.