Share News

‘కూటమి’ హామీల్లో దీపం పథకం ఒకటి

ABN , Publish Date - Nov 01 , 2024 | 11:43 PM

కూ టమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దీపం పథకం ఒకటని, ఈ పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.

‘కూటమి’ హామీల్లో దీపం పథకం ఒకటి
కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కూ టమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దీపం పథకం ఒకటని, ఈ పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో ఉన్న భారత గ్యాస్‌ కార్యాలయం వద్ద దీపం 2.0 పథకాన్ని ఆర్డీఓ జాన ఎర్వినతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీపం గ్యాస్‌ కనెక్షన కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు పథకాన్ని ప్రారంభించిందన్నారు. లబ్ధిదారులు పూర్తి అమౌంటు చెల్లిస్తే కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు డబ్బు చెల్లించిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి మిగిలిన అ మౌంటు వస్తుందన్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నారు. డబ్బు కట్టించుకోకుండాగ్యాస్‌ సిలిండరు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, ఏ పథకం సరిగా అమలు చేయడంలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. చంద్ర బాబు నాయకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు శివరాంరెడ్డి, ఎంపీడీఓ జ్యోతి, నగర పంచాయతీ కమిషనర్‌ జగన్నాథం, నగర పంచాయతీ చైర్‌పర్సన మార్పురి మేరి, టీడీపీ నాయకులు ఖాదర్‌బాషా, వాసుదేవరెడ్డి, రాఘవరెడ్డి, కంకర సుబ్బారెడ్డి, దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి, దాది రామయ్య, ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డి, వీఆర్వోలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2024 | 11:44 PM