Share News

రోడ్ల నిర్మాణంలో డిప్యూటీ సీఎం పవన రికార్డు

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:12 AM

రాష్ట్రంలో సిమెంటు రోడ్లు మంజూరు చేయడంలో, వాటిని నిర్మించడంలో డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ రికార్డు సృష్టించా రని జనసేన సంయుక్త రాష్ట్ర కార్యదర్శి మైఫోర్సు మహేష్‌ పేర్కొన్నారు.

రోడ్ల నిర్మాణంలో డిప్యూటీ సీఎం పవన రికార్డు
డిప్యూటీ సీఎం చిత్రపటానిక క్షీరాభిషేకం చేస్తున్న మైఫోర్సు మహేష్‌, జనసైనికులు

మదనపల్లె, డిసెంబరు 29(ఆంధ్ర జ్యోతి):రాష్ట్రంలో సిమెంటు రోడ్లు మంజూరు చేయడంలో, వాటిని నిర్మించడంలో డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ రికార్డు సృష్టించా రని జనసేన సంయుక్త రాష్ట్ర కార్యదర్శి మైఫోర్సు మహేష్‌ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడం మరోరికార్డుగా పేర్కొన్నారు. ఈసందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పవనకళ్యాణ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50రోజుల్లోనే 11072 సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేసినఘనత పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా అరుదైన గౌరవం దక్కిందన్నారు. గత వైసీపీ పాలన అయిదేళ్లలో అయిదువేల రోడ్లు కూడా వేయలేకపోయారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జనసేన లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అమర్‌నారాయణ, మహిళా నాయకురాలు శోభ భవ్య, సందీప్‌రెడ్డి, రమణారెడ్డి, చిరంజీవి, అప్సర్‌బాషా, నాగేంద్ర, దేవేంద్ర, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:12 AM