‘పల్లె పండుగ’తో అభివృద్ధి
ABN , Publish Date - Oct 14 , 2024 | 11:46 PM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు.
1 ఆర్సీటీ 14: పూలుకుంటలో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేస్తున్న
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
గ్రామాల్లో రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్
గాలివీడు, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అరవీడు, గాలివీడు, గోరానచెరువు, పూలుకుం ట పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సిమెంటు రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంటు రోడ్ల పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించినట్లు తెలిపారు. గాలివీడు మండ లంలో మొదటి విడతలో 2.15 కోట్ల రూపా యలతో సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలి పారు. త్వరలోనే మరికొన్ని సిమెంటు రోడ్లను మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్య క్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకు లు మండిపల్లి లక్ష్మిప్రసాద్‌రెడ్డి, పూలుకుంట సర్పంచ పార్థసారఽథిరెడ్డి, ఉపసర్పంచ పిచ్చ య్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రెడ్డి బాబు రెడ్డి, మాజీ సర్పంచ మహమ్మద్ రఫీ, టీడీపీ నాయకలు కృష్ణాంజ నేయులు, నాగేశ్వరరావు, రామాంజుల్‌రెడ్డి, టోపీవలి పాల్గొన్నారు.
చిన్నమండెం: మండలంలోని పడమటికోన గ్రామం బలిజపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
సంబేపల్లె: సంబేపల్లె మండలంలో అక్టోబరు 15 నుంచి 20వ తేదీ వరకు మంత్రి మండి పల్లి ఆధ్వర్యంలో పల్లెపండుగ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామచంద్ర తెలిపారు. మంగళ వారం ఉదయం 9 గంటలకు నారాయణరెడి ్డపల్లె గ్రామం సీకే రోడ్డు నుండి కేజీబీవీ జూనియర్ కాలేజీ వరకు 32 లక్షల రూపాయ లతో వేస్తున్న సీసీ రోడ్డు పనులను, దేవపట్ల గ్రామంలోని సీకే రోడ్డు నుండి దేవపట్లమ్మ ఆలయం వరకు 49.5 లక్షల రూపాయలతో వేస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ట్లు తెలిపారు.
సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
రైల్వేకోడూరు: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రూ. 45 లక్షల అంచనా వ్యయం తో సిమెంటు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పల్లె పండుగ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పఽథకం నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. రైల్వేకోడూరు పట్టణంలోని ప్రధాన దారి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు, ప్రధాన రహదారి నుంచి కొత్తకోడూరుకు వెళ్లే రోడ్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కూట మి అధికారం లోకి రాగానే పంచాయతీలను అభివృద్ధి పథం లోకి తీసుకెళ్లాలని కంకణం క ట్టుకున్నామ న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపుతామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన కళ్యాణ్ నిర్వీర్యం అయిన పంచా యతీరాజ్ వ్యవస్థను బాగుచేసే క్రమంలో పల్లెపండుగలో సిమెంటు రోడ్లు వేయడానికి ఉపాధి హామీ పఽథకం ద్వారా శ్రీకారం చుటా ్టరని తెలిపారు. రైల్వేకోడూరు పట్టణంలో మొత్తం 900 మీటర్ల వరకు సిమెంట్ రోడ్లకు నిఽ దులు మంజూరు చేశారని తెలిపారు. మండ లంలోని సింగిరివారిపల్లెలో 400 మీటర్ల సి మెంట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఇందు ు 20 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైల్వే కోడూరు ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, అధికారులు బాల నరసింహు లు, ఉమా మహేశ్వర్‌రావు, ఉమామహేశ్వర్‌రెడ్డి, వర్క్ ఇనస్పెక్టర్ మస్తాన, టీడీపీ నాయకులు నార్జాల హేమరాజ్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓబులవారిపల్లె:చిన్నఓరంపాడు పంచాయతీ సీవో కమ్మపలెలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీఇనఛార్జి ముక్కా రూపానందరెడ్డి 22 లక్షల వ్యయంతో 350 మీటర్లు సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు మాజీ ఎంపీీ పలు వెంకటేశ్వర్రాజు, తిరుపాల్, తహసీల్దారు శ్రీధర్‌రావు, ఎస్ఐ మహేష్, ఎంపీడీవో మల్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, మండల టీడీపీ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, అనుమలగుండం చంద్రమోహన, కల్లా చలపతి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.