Share News

అందినంత తవ్వుకో... వచ్చినంత దాచుకో....

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:33 PM

జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్నానది పరిసర ప్రాంతాలు వైసీపీ నేతలకు కల్పతరువుగా మారిందని చెప్పవ చ్చు. ఐదేళ్లగా నియోజకవర్గంలోని అంబవరం, కన్నెలూరు, పొన్నతోట, గూడెం చెరువు, దానవులపాడు, పి.సుగుమంచిపల్లి, మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామాల పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ గుంతలై దర్శనమిస్తున్నాయి. ఏడాది కిందట టీడీపీ అధిష్టానం పిలుపుమేరకు జమ్మలమడుగులో ప్రస్తుత కడప టీడీపీ పార్లమెంటు అభ్యర్థి భూపేశ్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డికి చెందిన ఇసుక టిప్పర్‌ ఎదుట పెన్నానదిలో నిరసన వ్యక్తం చేసి నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేశారని బహిరంగ ఆరోపణలున్నాయి.

అందినంత తవ్వుకో... వచ్చినంత దాచుకో....
పెన్నానదిలో ఇసుకను నింపుతున్న ఎక్స్‌కవేటర్‌ (ఫైల్‌ఫొటో)

వైసీపీ నేతలకు కాసులు కురిపించిన ఇసుక

ఎడారిగా మారి ఇసుక గుంతలతో పెన్నానది

ఏడాది కిందటే నిరసన తెలిపిన భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, ఏప్రిల్‌ 23: జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్నానది పరిసర ప్రాంతాలు వైసీపీ నేతలకు కల్పతరువుగా మారిందని చెప్పవ చ్చు. ఐదేళ్లగా నియోజకవర్గంలోని అంబవరం, కన్నెలూరు, పొన్నతోట, గూడెం చెరువు, దానవులపాడు, పి.సుగుమంచిపల్లి, మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామాల పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ గుంతలై దర్శనమిస్తున్నాయి. ఏడాది కిందట టీడీపీ అధిష్టానం పిలుపుమేరకు జమ్మలమడుగులో ప్రస్తుత కడప టీడీపీ పార్లమెంటు అభ్యర్థి భూపేశ్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డికి చెందిన ఇసుక టిప్పర్‌ ఎదుట పెన్నానదిలో నిరసన వ్యక్తం చేసి నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా చేశారని బహిరంగ ఆరోపణలున్నాయి. వైసీపీ పాలనలో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల అధికారులు ఏ ఒక్కరూ చర్యలు తీసుకోవడానికి సాహసించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నేరుగా పెన్నానదిలోనే టిప్పర్లు చేరి ఎక్స్‌కవేటర్ల ద్వారా ప్రత్యేకంగా ఇసుక దోపిడీలో భాగంగా పెన్నమ్మను గుంతలమయం చేశారు. ఫలితంగా వైసీపీ నేతలు, అనుయాయులకు భారీగా కాసులు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇసుక డబ్బుతోనే వైసీపీలోని కొందరు నేతలు ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది. జమ్మలమడుగు మండలం గూడెంచెరువు, గండికోట, సున్నపురాళ్లపల్లె, చిటిమిటి చింతల, కొత్తరోడ్డు తదితర ప్రాంతాల్లో గ్రావెల్‌ మట్టి జోరుగా తరలించారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఎర్రమట్టి గుంతలు దర్శనమిస్తున్నాయి.

గతంలో పెన్నానదిలో ఇసుక పోతే స్థానిక రైతులకు, మంచినీటి బోర్లకు నీటి సమస్య ఏర్పడుతోందని దానవులపాడు గ్రామం అంబవరం గ్రామాల్లో ప్రజలు అధికారులకు తెలియజేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని విమర్శలు వినపడుతున్నాయి. గతంలో అనేక పర్యాయాలు దానవులపాడు, అంబవరం వాసులు టిప్పర్లను అడ్డుకుని రోడ్లు చెడి పోతున్నాయి, ఇక నుంచి గ్రామం నుంచి ట్రాక్టర్లను తిప్పవద్దని ధర్నా చేపట్టారు. ఒకానొక దశలో ఇసుక అక్రమ రవాణా ను ఫారెస్టు అధికారులు అడ్డుకుని ఎక్స్‌కవేటర్లను సైతం సీజ్‌ చేశా రు. వీరికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలకడం, తర్వాత అధి నేతలు రంగంలోకి దిగడంతో వాటిని వదిలేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ నేతలు చేసిన అక్రమ ఇసుక రవాణాతో వర్షాభావ పరిస్థితుల వలన ఆయా గ్రామాలకు భూగర్భజలం అడుగంటి పెన్నానదిలో వేసిన బోర్లకు సైతం నీరు ఎక్కడంలేదని ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు, సచివాలయాల సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ఇప్పటికీ ఇసుక ట్రాక్టర్లు తరలిపోతున్నాయని తెలుస్తోంది. కొందరు అధికారులకు అక్రమ ఇసుక రవాణా జరిగితేనే లాభదాయకంగా ఉంటుందని ప్రజలు సంబంధిత అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లోని పెన్నానదిలో ఇసుక, ఎర్రమట్టి గ్రావెల్‌ పూర్తిగా ఖాళీ అయింది.

Updated Date - Apr 23 , 2024 | 11:33 PM