Share News

డాక్యుమెంటు రైటర్లను ఇబ్బందులు పెట్టొద్దు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:52 PM

సబ్‌రిజి స్ర్టార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న డాక్యు మెంటు రైటర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని దస్తావేజులేఖకుల సం ఘం అధ్యక్షుడు రంగు గుణశేఖర్‌ పేర్కొన్నారు.

డాక్యుమెంటు రైటర్లను ఇబ్బందులు పెట్టొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం అధ్యక్షుడు

మదనపల్లె, డిసెంబరు 22: సబ్‌రిజి స్ర్టార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న డాక్యు మెంటు రైటర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని దస్తావేజులేఖకుల సం ఘం అధ్యక్షుడు రంగు గుణశేఖర్‌ పేర్కొన్నారు. మదనపల్లెలో ఆదివారం ఆసంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఫైనా న్స బ్యాంకు సిబ్బంది వచ్చి సబ్‌రిజిస్ర్టార్‌ అధికారులు, సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని డైరెక్ట్‌గా రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు వాపోయారు. దీంతో కొన్నేళ్లుగా ఇదే వృత్తి మీద ఽఆధారపడి జీవిస్తున్న తాము జీవనోపాధి కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 15ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్న వారు కొనసాగుతూ వారి వద్ద సహాయకులుగా పని చేస్తున్న వారి ని కూడా కమిటీలో చేర్చుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. చట్టానికి, నిబంఽ దనలకు లోబడి ఉన్న డాక్యుమెంట్లను మాత్రమే రాయాలని తేల్చిచెప్పారు. సమావేశంలో రైటర్లు ఎస్‌.చిన్నసాయి, తాళ్ల జయచంద్రనాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, హరిబాబునాయుడు, ఎస్‌.శ్రీనివాసులునాయుడు, ఎం.చంద్రశేఖర్‌రావు, గజేంద్ర, గణేష్‌స్వామి, రెడ్డెప్ప, నూర్‌ అహ్మద్‌, హామీ అహ్మద్‌ పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక:అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రంగు గుణశేఖర్‌, గౌరవాధ్యక్షుడిగా రంగు రాజేంద్ర, ఉపాధ్యక్షునిగా మంచినీళ్ల నాగమునీంద్ర, కార్యదర్శిగా కంగేరి నందా, సంయుక్త కార్యదర్శిగా జి.రెడ్డెప్ప, ట్రెజరర్‌గా మహ్మద్‌ఖాన(లవానీ బాబు), కార్యవర్గ సభ్యులుగా కరూర్‌ వెంకటేష్‌, ఎస్‌.పెద్దసాయి, మచ్చా నారాయణ, నవీనకుమార్‌, ఎ.శివరామయ్యగుప్త, జి.శ్రీనివా సులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:52 PM