సమర్థవంతంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణ: ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:37 PM
శాప్ సహకారంతో కడపలోని స్పోర్ట్స్ స్కూల్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తామని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు.
కడప స్పోర్ట్స్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : శాప్ సహకారంతో కడపలోని స్పోర్ట్స్ స్కూల్‌ను సమర్ధవంతంగా నిర్వహిస్తామని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. గురువారం స్థానిక రిమ్స్ సమీపంలో గల స్పోర్ట్స్ స్కూల్లో అక్కడి ఉద్యోగులు, డీఎ్‌సఏ అధికారులతో శాప్ చైర్మన రవి నాయుడు నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని మా ట్లాడారు. స్పోర్ట్స్ స్కూల్‌కు సంబంధించి ఎ టువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీ సుకురావాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం ఆ స్కూల్ నిర్వహణ, హాస్టల్ సదుపాయాలు, క్రీడాకారులకు అందుతున్న మెనూ, వసతులు, వైద్యపరీక్షలు, ఉద్యోగుల విధులు, బాధ్యతలపై శాప్ చైర్మన, ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, టీఎనఎ్సఎ్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, తెలుగు యువత అధికార ప్రతినిధి నవీనరెడ్డి, జనరల్ సెక్రటరీ అమర్నాథ్రెడ్డి , డీఎ్‌సఏ కబడ్డీ కోచ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.