ఆపరేషన వికటించి వృద్ధుడు మృతి
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:10 AM
స్థానిక పటేల్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన వికటించి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మదన పల్లెలో చోటు చేసుకుంది.
మదనపల్లె అర్బన, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): స్థానిక పటేల్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన వికటించి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మదన పల్లెలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మృతుడి బంధువులు మృతదే హాన్ని ఆస్పత్రి ముందు ఉంచి ఆంధోళన చేపట్టారు. బాధితుని వివరాల మేరకు పెద్దపంజాణి మండలం, రాయలపేట పంచాయతీ నాగిరెడ్డిపల్లెకు చెందిన ఆర్ వెంకటేశ (58)రెండు రోజుల క్రితం గుండె నొప్పితో మదనపల్లె పట్టణం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్ రోగిని పరీక్షలు నిర్వహించి అత్యవసరంగా స్టంట్ వేయా లని తెలపడంతో అందుకు అంగీకరించి డబ్బు కట్టి యాంజియో గ్రామ్‌చేయించారని తెలిపారు. అనం తరం స్వగ్రామానికి తీసుకెల్లిన వెంకటేశకు గుండెలో నొప్పి రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాధితులు మెరుగైన వైద్యం కోసం సిటీకి పంపాలని కోరినా డాక్టర్ పెడ చెవినపెట్టి రెండోసారీ ఆఫరేష న చేస్తానని చెప్పి తిరిగి ఆఫరేషన చేశాడు. ఈ క్రమంలో ఆపరేషన చేస్తున్న సమయంతోనే రోగికి హార్ట్‌అటాక్ రావడంతో ఆక్కడే ఆపరేషన థియేటర్ లో మృతి చెందాడు. వెంకటేశ మృత దేహాన్ని బంధువులకు కూడా చెప్పకుండా హడావుడిగా అం బులెన్స ఎక్కించే ప్రయత్నం చేశాడు డాక్టర్, దీనికి బంధువుల ఆవేశంతో మృతదే హాన్ని ఆస్పత్రి గేటు ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. డాక్టర్ కావాలనే మా తండ్రిని చంపేశార ని మృతుడి కుమారుడు గణపతి ఆరోపణ చేశారు. గంటసేపు ఆందోళన చేయగా టూటౌన సీఐ రామ చంద్ర అక్కడికి చేరు కుని బాధితులతో మాట్లాడి మృతదేహాన్ని మదన పల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలిం చారు. కేసు విచారణ చేస్తునట్లు సీఐ తెలిపారు.