Share News

జిల్లా కేంద్రానికి.. ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:01 PM

అన్నమయ్య జిల్లాకు సార్వత్రిక ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడుగా నియమితులైన దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ ఐపీఎస్‌ మంగళవారం అన్నమయ్య జిల్లాకు వచ్చారు. ఎస్పీ కృ ష్ణారావు పుష్పగుచ్ఛం అందించి ఆయన కు స్వాగతం పలికారు.

జిల్లా కేంద్రానికి.. ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడు
పోలీసు పరిశీకుడికి స్వాగతం పలుకుతున్న ఎస్పీ కృష్ణారావు

రాయచోటిటౌన, ఏప్రిల్‌ 23: అన్నమయ్య జిల్లాకు సార్వత్రిక ఎన్నికల పోలీస్‌ పరిశీలకుడుగా నియమితులైన దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ ఐపీఎస్‌ మంగళవారం అన్నమయ్య జిల్లాకు వచ్చారు. ఎస్పీ కృ ష్ణారావు పుష్పగుచ్ఛం అందించి ఆయన కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్ల వివరాలను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా లో ప్రజలందరూ శాంతియుత వాతావ రణంలో నిర్భయంగా ఓటు హక్కు విని యోగించుకునేలా చర్యలు తీసుకుంటామ న్నారు. శాంతి భద్రతలపై ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలని, తన ఫోన నెంబర్‌ 89779 46222కు ఫోన చేసి ఫిర్యాదులు తెలపవచ్చునన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:01 PM