విద్యుత చార్జీలు వెంటనే తగ్గించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:24 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెంచిన వి ద్యుత చార్జీలు వెంటనే తగ్గించాలని కడప ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు.
ర్యాలీలో వైసీపీ నాయకులు
పులివెందుల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెంచిన వి ద్యుత చార్జీలు వెంటనే తగ్గించాలని కడప ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ట్రాన్సకో డీఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే విద్యుత చార్జీలు పెంచారన్నారు. రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విద్యుత చార్జీల భారం మోపారన్నారు. విద్యుత కనెక్షన్లు పెండింగ్‌లో పెట్టారన్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎలక్ర్టిసిటీ డిస్కంలకు సబ్సిడీ కింద కేవలం రూ.13వేలకోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు రూ.48వేల కోట్లు డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్ల వర కు బిల్లు అవసరం లేదని వైసీపీ ప్రభుత్వం ప్రకటించగా చంద్రబాబు ప్రభుత్వంలో బిల్లుల వసూళ్లకు పరుగులు తీస్తున్నారన్నారు. అనంతరం డీఈ ప్రసాద్‌రెడ్డికి వినతిపత్రి అందజేశారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన చిన్నప్ప, మున్సిపల్ చైర్మన వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాదుడే బాదుడు: అంజద్ బాషా
కడప ఎర్రముక్కపల్లి డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విద్యుత చార్జీల పేరు తో ప్రజలపై బాదుడే బాదుడు అన్నట్లుగా వ్యవ హరిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ బాషా, కడప మేయర్ సురేశ బాబు ధ్వజ మెత్తారు. శుక్రవారం వారు కడప నగరంలో పోరుబాట నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి విద్యుత భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత శాఖ జిల్లా అధికారి రమణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మే రకు పెంచిన విద్యుత చార్జీలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రవుమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్య, మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, సీనియర్ నాయకులు సుభానబాషా, కార్పొరేటర్లు, కో-ఆప్షన సభ్యులు పాల్గొన్నారు.
పేదలపై విద్యుత భారం తగ్గించాలి
కమలాపురం రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పేదలపై విద్యుత భారం తగ్గించాలని వైసీపీ కమాలపురం నియోజకవర్గ ఇనచార్జ్ నరేన రామాంజులరెడ్డి అన్నారు. శుక్రవారం కమలాపురంలో నిర్వహించిన పోరుబాట నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.