విద్యుతను పొదుపుగా వినియోగించాలి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:53 PM
విద్యుత వినియోగ దారులు ఇళ్లలో పొదుపుగా విద్యుత ను వినియోగిస్తూ భవిష్యత అవస రాలకు నిల్వ చేయాలని ఎస్పీడీసీ ఎల్ ఈఈ గంగాధర్ పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత వినియోగ దారులు ఇళ్లలో పొదుపుగా విద్యుత ను వినియోగిస్తూ భవిష్యత అవస రాలకు నిల్వ చేయాలని ఎస్పీడీసీ ఎల్ ఈఈ గంగాధర్ పేర్కొన్నారు. గురువారం ఇంధన పొదుపు వారో త్సవాల్లో భాగంగా స్థానిక ఎస్పీడీసీ ఎల్ డివిజన కార్యాలయం నుంచి ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వి హంచారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ గృహాల్లో ఎల్‌ఈ డీ బల్బులు, స్టార్ రేటెడ్ ఉపకరణాలనే ఉపయోగించాలన్నారు. సోలార్ రూఫ్‌టాప్ సర్వీసెస్‌ను పెంచాలన్నారు. డీఈలు సురేంద్రనాయక్, హరికుమార్, ఏఏవో కిరణ్‌కు మార్, జేఏవో రెడ్డెప్ప, గణేష్‌బాబు, ఏఈ లు కుమార్‌బాబు, అజయ్,ముజమ్మీల్, రమేష్, రామ్మూర్తి,ఉత్తన్న, నాగరాజ పాల్గొన్నారు.