బీసీ వసతి గృహాలను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:33 PM
తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీసీ వసతి గృహాలను ఏర్పాటు చేసి న్యా యం చేమాలని మంత్రి సవిత మ్మను టీడీపీ రాజంపేట పార్ల మెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ కోరారు.
మంత్రికి టీడీపీ బీసీ నేత సురేంద్రయాదవ్ వినతి
కురబలకోట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీసీ వసతి గృహాలను ఏర్పాటు చేసి న్యా యం చేమాలని మంత్రి సవిత మ్మను టీడీపీ రాజంపేట పార్ల మెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ కోరారు. మం గళగిరిలోని టీడీపీ కార్యాలయం లో మంత్రిని కలిసిన ఆయన నియోజకవర్గంలో నెలకొన్న సమస్య లపై వినతి పత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనా యించారని, ఆ కేసుల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటుగా వారికి అన్ని విధాలా న్యాయం చేయాలని కోరమన్నారు.