Share News

సాగునీటి సంఘాల సమరానికి సర్వం సిద్ధం

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:02 AM

తంబళ్లపల్లె నియోజకవర్గంలో శనివారం సాగునీటి సంఘాల సమరా నికి అధి కారులు సర్వం సిద్ధం చేశారు.

సాగునీటి సంఘాల సమరానికి సర్వం సిద్ధం
తంబళ్లపల్లెలోని పెద్దేరు ప్రాజెక్టు

తంబళ్లపల్లె నియోజకవర్గంలో 38 చెరువులు, పెద్దేరు ప్రాజెక్టుకు ఎన్నికలు

ఒకే రోజు మెంబర్లు, అధ్యక్ష, ఉపాధ్యక్షుడు ఎన్నిక

ములకలచెరువు, డిసెంబరు 13(ఆంధ్ర జ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గంలో శనివారం సాగునీటి సంఘాల సమరా నికి అధి కారులు సర్వం సిద్ధం చేశారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 38 చెరువులు, పెద్దేరు ప్రాజెక్టు కు ఎన్నికలు జరగనున్నాయి. టీసీ మెం బర్లు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నిక ఒకే రోజు జరగనుంది. ఆయా చెరువులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రి య జరగనుంది. సాగు నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11వతేదీన అధికారులు నోటిఫికేషన విడుదల చేశారు. ఎన్నికలు జరుగుతున్న చెరువుల పరిధి లో ఉన్న ఆయకట్లు రైతులు ఓటర్లుగా ఉంటారు. ఉదయం 8గంటల నుంచి 1 గంట లోపు ఒక్కో చెరువుకు ఆరుగురు టీసీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆయకట్టు రైతు లందరూ సమావేశమై చేతులెత్తే పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. పోటీ ఉంటే రహస్య ఓటింగ్‌ ద్వారా టీసీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికైన ఆరు గురు టీసీ మెంబర్లలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్య క్షుడిగా ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియతో ఎన్నికలు ముగుస్తాయి. తంబళ్లపల్లె నియో జకవర్గంలోని తంబళ్లపలె మండలంలో 11(పెద్దేరు ప్రాజెక్టుతో కలిపి), ములకల చెరువు మండలంలో 8, పెద్దతిప్పసముద్రం మండలంలో ఏడు, పెద్దమండ్యం మండలంలో ఆరు, బి.కొత్తకోట మండలంలో ఐదు, కురబలకోట మండలంలో రెండు చెరువులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇరగేషన ఏఈలు శ్రీనివాసులు, సతీష్‌కుమా ర్‌లు తెలిపారు.

పీలేరులో మూడు చెరువులు, 852 మంది ఓటర్లు

పీలేరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పీలేరు మండలంలో మూడు చెరువులకు సాగు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయిం చారు. వాటిలో పీలేరు పట్టణంలోని అయ్యప్పనాయుని చెరువు, దొడ్డిపల్లె పంచా యతీలోని చింతల చెరువు, గూడరేవుపల్లెలోని సూరప్ప చెరువుల ఉన్నాయి. అయ్య ప్పనాయుని చెరువు పరిధిలో ఆరు టెరిటోరియల్‌ కాన్స్టిట్యూయెన్సీ(టీసీ)లలో 371 మంది ఓటర్లు ఉన్నారు. చింతల చెరువు పరిధిలో ఆరు టీసీలలో 270 మంది ఓటర్లు ఉన్నారు. సూరప్ప చెరువు పరిధిలో ఆరు టీసీలలో 211 మంది ఓటర్లు ఉన్నారు. వెరసి మూడు చెరువుల్లో 18 టీసీలలో 852 మంది ఓటర్లు ఎన్నికలలో పాల్గొనను న్నారు. ఎన్నికలు సజావుగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు తహసీల్దారు భీమేశ్వ ర రావు, పీలేరు అర్బన సీఐ యుగంధర్‌ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో చెరువుకు 14 మంది సిబ్బందిని నియమించారు. వారందరూ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ఆయా సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి చేయనున్నారు. అయ్యప్ప నాయుని చెరువుకు కోటపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, చింతల చెరువుకు శివరామా పురంలోని గ్రామ సచివాలయం, సూరప్ప చెరువుకు గూడరేవుపల్లెలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహసీల్దారు తెలిపారు.

Updated Date - Dec 14 , 2024 | 12:02 AM