Share News

ఆర్భాటం తప్ప.. ఆచరణ శూన్యం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:48 PM

గత వైసీపీ ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో చాలా పనులు చేపట్టకపోవడంతో లక్షల్లో ప్రజా ధనం దుర్వినియోగంగా మారింది.

ఆర్భాటం తప్ప.. ఆచరణ  శూన్యం
పెద్దమండ్యంలో అరకొర పనులు పూర్తికాక ఆగిపోయిన గ్రామ సచివాలయం

గత వైసీపీ నిర్వాకంతో అరకొర పనులు పూర్తికాక ఆగిన సచివాలయ భవనాలు బిల్లుల జాప్యంతోనే సమస్యలంటున్న నిర్మాణదారులు

పెద్దమండ్యం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి) గత వైసీపీ ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో చాలా పనులు చేపట్టకపోవడంతో లక్షల్లో ప్రజా ధనం దుర్వినియోగంగా మారింది. ఇందుకు నిదర్శ నం వైసీపీ ఏర్పాటు చేసిన సచివాలయ భవనాలే కారణం. లక్షలు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టిన చివరకు సకాలంలో సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో భవన నిర్మాణదారులు వాటిని అలాగే వదలివేయడంతో అవి నిరుపయోగంగా ఉం టూ వెక్కిరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దమం డ్యం మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు. 11 రైతు భరోసా కేంద్రాలు, 7 గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల కొత్త భవన నిర్మాణ పనులను ఆర్భాటంగా చేపట్టింది. ఒక్కొక్క భవనాకి రూ. 35 లక్షల నిధు లు మంజూరు చేసింది. ఇందులో పెద్దమండ్యం, పాపేపల్లి, సి.గొల్లపల్లి, ముసలికుంట, కలిచెర్ల, ఎన వోపల్లి, కోటకాడపల్లి, బండ్రేవు, సిద్దవరం, వెలిగల్లు, బండమీదపల్లి గ్రామ సచివాలయాలున్నాయి.కానీ ఏ ఒక్క చోట కూడ కొత్త సచివాలయ భవనాల్లో పరిపాలనకు నోచుకోలేదు. 7 గ్రామీణ ఆరోగ్యకేం ద్రాలకు గాను ఒక గ్రామీణ ఆరోగ్య కేంద్రం తుది ధశ పనుల్లో ఉంది. మండలంలో పలు చోట్ల గ్రా మాలకు దూరంగా సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టడడంతో అప్పట్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టినట్లు అప్పట్లో తీవ్రఆరోపణలు వచ్చాయి. డివిజన స్థాయిల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు(డీఎల్‌డీవో) ప్రత్యేక అధికారులను కేటాయించిన అభివృద్ధి పనుల పురోగతి లేకుండా పోయింది. అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జాప్యం జరగడంతో కాంట్రాక్టర్లు తట స్థత స్థితిలో ఉండిపోయారు. కాగా బండ్రేవు గ్రామ సచివాలయం పరిధిలోకి మందలవారిపల్లి, అవికేనా యక్‌తాండ, దిగువపల్లి గ్రామ పంచాయతీలు ఉ న్నాయి. ఈ మూడు గ్రామ పంచాయతీల ప్రజలు బండ్రేవు సచివాలయంలో వివిద పత్రాలు దరఖా స్తుల కోసం 5 లేక 6 కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. అలాగే శివపురం గ్రామ ప్రజలు 4 కిలో మీటర్లు నడిచి సిద్దవరం గ్రామ సచివాలయానికి పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో కూటమి ప్రభు త్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నిధుల కోసం ప్రతిపాదన పంపించాం

అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవన నిర్మాణాల కు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిం చాం. అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఎనవోపల్లి ఆర్‌బీకే బిల్లుల కోసం ప్రతిపాదన పం పించాం. నిధులు విడుదల అయిన వెంటనే భవనాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.

-ఫేక్‌ షావాజ్‌ బాష, పీఆర్‌ ఇనచార్జ్‌ ఏఈ,

పెద్దమండ్యం మండలం

Updated Date - Dec 22 , 2024 | 11:48 PM