రైతుల సంతోషమే సీఎం చంద్రబాబు లక్ష్యం
ABN , Publish Date - Sep 03 , 2024 | 10:57 PM
రాష్ట్రంలో రైతుల సంతోషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు.
నాలుగేళ్ల తర్వాత ఒంటిమిట్ట చెరువుకు నీరు
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు
ఒంటిమిట్ట, సెప్టెంబరు 3 : రాష్ట్రంలో రైతుల సంతోషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం సోమశిల వెనుకజలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని మూలనపడేశారని తెలిపారు. ఒంటిమిట్ట చెరువుకు నీటి విడుదల గురించి కడప జిల్లా కలెక్టర్ శివశంకర్‌తో మాట్లాడి నిధులు కేటాయించడంతో పాటు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దీంతో ఈఈ వెంకటరామయ్య, డీఈ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో నిపుణులను రప్పించి పైపులకు మరమ్మతులకు చేపట్టారన్నారు. విద్యుత్ సరఫరాలో సాంకేతికలోపం ఉండడంతో విద్యుత్ అధికారులు వెంటనే మరమ్మతులు చేయడంతో మంగళవారం సాయంత్రం ఎట్టకేలకు ఒంటిమిట్ట చెరువుకు సోమశిల వెనకజలాలు చేరాయి. విషయం తెలుసుకున్న మండల రైతాంగం పెద్దఎత్తున ఎత్తిపోతల పథకం పైపులైను వద్దకు వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజల ప్రభుత్వమని, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జగన్‌మోహన్‌రాజు అన్నారు. రాష్ట్ర గుర్తింపు పొందిన కోదండరామాలయం వద్ద ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీటిని సరఫరా చేస్తుండడం బాధాకరమని వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవ తీసుకున్నానని, ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను కూడా వెచ్చించి రైతులకు నీరు అందించాలని పట్టుదలతో పనిచేశానని తెలిపారు. అనంతరం నీటి వద్ద హారతి ఇచ్చి పూజలు చేశారు. కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ ఈఈ వెంకటరామయ్య, డీఈ వాసుదేవరెడ్డి, టీడీపీ నాయకులు కొమరా వెంకటనరసయ్య, మామిళ్ల ఈశ్వరయ్య, రేవిళ్ల బాలమునెయ్య, మోదుగుల నరసింహులు, కత్తి అయ్యవారయ్య, హరినాథరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.