రైతులు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పిస్తా
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:05 AM
పేద రైతులు కోల్పో యిన భూములను తిరిగి ఇప్పిస్తా నని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ రాష్ట్రకార్యదర్శి కొండ్రెడ్డి
మదనపల్లె అర్బన, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):పేద రైతులు కోల్పో యిన భూములను తిరిగి ఇప్పిస్తా నని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కురబలకోట మం డలం అంగళ్లు గ్రామంలో గత ఐదే ళ్లు పాలనలలో ఎమ్మెత్యే ద్వారకనాథరెడ్డి అండదండలు చూసుకుని కొంతమంది వైసీపీ నాయకులు పేదల భూములను ఆక్రమించేసి అమ్మేశారని ఆరోపించారు. అప్పట్లో పేదలను భయాందోళనలకు గురిచేశారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అంగళ్లు పరిసరప్రాంతాల్లో జరిగిన భూఆక్రమణలు, దౌర్జన్యాలు, భూ కుంభకోణాలపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూ కుంబకోణాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేష్ దృష్టికి తీసుకెళ్లుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటూ వారి కోల్పోని భూములను వారికి ఇప్పించే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో భూబాధితులు రవి, ఆంజనేయులు,మునిస్వామిరెడ్డి, టీడీపీ నాయకులు చంద్రరెడ్డి, నాగభూషణం, మాజీ సర్పంచులు ఎంవీ మోహన, రమణప్ప పాల్గొన్నారు.