ఉచిత ఇసుక ప్రైవేటు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:17 AM
ఉచిత ఇసుక ప్రైవేటు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
కడప సెవెనరోడ్స్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక ప్రైవేటు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, డిప్యూ టీ జనరల్ సెక్రటరీ కేసీ బాదు ల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామాంజనేయులు, లింగన్న మాట్లాడారు. ఉచిత ఇసుక నిర్ణయం అభాసుపాలు కాకుండా మధ్య దళారీ వ్యవస్థ ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టడం మానుకోవాలని, నిర్మాణరంగ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సిమెం టు, ఐరన, కలప నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, చాంద్‌బాషా, నాగన్నగౌడ్, కార్మిక సంఘం నాయకులు ఏసోబు, తదితరులు పాల్గొన్నారు.