Share News

బొమ్మనచెరువులో భూములను ఫ్రీహోల్డ్‌ చేయండి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:54 PM

ఏడాది క్రితం వైసీపీ వర్గానికి చెందిన రైతుల భూములు ఫ్రీహోల్డ్‌ చేసి, విక్రయాలు చేశారు.

బొమ్మనచెరువులో భూములను ఫ్రీహోల్డ్‌ చేయండి
రెవెన్యూ సదస్సులో అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్న ప్రజలు

రెవెన్యూ సదస్సులో అధికారులకు రైతుల వినతి

మదనపల్లె టౌన, డిసెంబరు 27(ఆంధ్ర జ్యోతి): ఏడాది క్రితం వైసీపీ వర్గానికి చెందిన రైతుల భూములు ఫ్రీహోల్డ్‌ చేసి, విక్రయాలు చేశారు. ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్న మా భూములు కూడా ఫ్రీహోల్డ్‌ చేయండంటూ మదనపల్లె మండలం బొమ్మనచెరువు రైతులు రెవెన్యూ అధికారుల కు విన్నవించారు. శుక్రవారం బొమ్మనచెరువు లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి అనుభవించు కుంటు న్న డీకేటీ, చుక్కల భూములు ఉన్నాయ ని, వాటిని ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ చేయాలని కోరారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వాటితో పాటు పాసుపుస్తకాలు, ఇతర భూవివాదాలకు చెందిన అర్జీలను ప్రజలు అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో అమరనా ఽథరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ అస్లాంబాషా, కొత్తపల్లె ఉపసర్పంచ నందకుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:54 PM