గండి ఆలయ హుండీ లెక్కింపు
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:13 PM
హుండీలోని కానుకల ద్వారా గండి ఆలయానికి రూ.14, 05,372 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు.
చక్రాయపేట, ఫిబ్రవరి 5:హుండీలోని కానుకల ద్వారా గండి ఆలయానికి రూ.14, 05,372 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.14,753 నగదు, 8.200 గ్రా ముల బంగారం, 520.340 గ్రాముల వెం డి వచ్చినట్లు ముకుందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జనార్దన్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఏపీజీబీ మేనేజర్ జనార్దన్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఏపీజీబీ మేనేజర్ అశోక్‌కుమార్, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, కళ్యాణకట్ట క్షురకులు పాల్గొన్నారు.