ఘరానా దొంగ అరెస్టు
ABN , Publish Date - Sep 29 , 2024 | 11:52 PM
మదనపల్లె డివిజన పరిధిలో ఏడుచోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతడికి సహకరించిన బాలుడిని అరెస్టు చేసి 28 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు.
28 లక్షల విలువైన బంగారం స్వాధీనం
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 29: మదనపల్లె డివిజన పరిధిలో ఏడుచోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతడికి సహకరించిన బాలుడిని అరెస్టు చేసి 28 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు. ఆదివారం తాలుకా పోలీ్‌సస్టేషనలో మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె డివిజనలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం మదనపల్లె తాలుకా సీఐ కళావెంకటరమణ, జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, మదనపల్లె సబ్ డివిజన క్రైం పార్టీ వారు కలిసి మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ రామసముద్రం రోడ్డులోని ఆశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంకు సమపంలో టీసీ నాగరాజ (30)తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా మదనపల్లె సబ్ డివిజనల్లో ఏడుచోట్ల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితుడిని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివా్‌సపురం తాలుకా పులగూరకోటకు చెందిన చలపతి కుమారుడు టీసీ నాగరాజగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.28 లక్షల విలువ చేసే బంగారు నగలు, రూ.12 వేలు విలువ చేసే వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ గతంలో కర్ణాటక మద్యం విక్రయించే కేసుల్లో పీలేరు, ములకలచెరువు, మదనపల్లె తాలుకా పోలీసు స్టేషన్లలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. టీసీ నాగరాజ కర్ణాటకలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడని చెప్పారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు కళా వెంకటరమణ, చంద్రశేఖర్, ఎస్‌ఐ హరిహరప్రసాద్, ఏఎ్‌సఐ సుబ్రమణ్యం, హెడ్ కానిస్టేబుల్స్ శంకర, శివ, ఐడీ పార్టీ పోలీసులను డీఎస్పీ అభినందించారు. అనంతరం వారికి క్యాష్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో వనటౌన సీఐ చాంద్‌బాషా, పోలీసులు పాల్గొన్నారు.