Share News

మహిళలకు అవకాశం కల్పిస్తే దేశానికి కీర్తి

ABN , Publish Date - Nov 09 , 2024 | 12:23 AM

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వివక్ష చూపకుండా వారికి సమాన అవకాశాలు కల్పిస్తే దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారని వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసరు క్రిష్ణారెడ్డి అన్నారు.

మహిళలకు అవకాశం కల్పిస్తే దేశానికి కీర్తి

వైవీయూ వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి

కడప ఎడ్యుకేషన, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వివక్ష చూపకుండా వారికి సమాన అవకాశాలు కల్పిస్తే దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారని వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసరు క్రిష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వైవీయూ హ్యుమనిటీ భవనలో మహిళలకు సామాజిక అవగాహన అనే అంశం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రొఫెసరు ఎంఎం వినోదిని అధ్యక్షత వహించగా వైస్‌చాన్సలర్‌ మాట్లాడుతూ లింగ వివక్షత నిర్మూలించే దిశగా వైవీ యూ విద్యార్థులు ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని ఈశాన్యదేశాల్లో మహిళలకు చాలా గౌరవం ఉందన్నారు. మహిళలు సమాజానికి శక్తి అని వారు సంతోషంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విశిష్ట అతిథి తెలంగాణా హైకోర్టు న్యాయవాది, హక్కుల కార్యకర్త వసుధ నాగరాజు ‘మహిళా ఉద్యమాలు-చట్టాలు’ అనే అంశంపై మాట్లాడుతూ 1972లో మహారాష్ట్రలో మొదలైన అత్యాచార సంఘటన నుంచి 2019లో వచ్చిన దిశ సంఘటన వరకు మహిళా ఉద్యమాలు జరిగాయన్నారు. విద్యార్థిను లు, యువత, మహిళలు మౌన నిశ్శబ్దం వీడానలి ఆకాంక్షించారు. అత్యంత పేదవర్గాలు న్యాయస్థానం తలుపులు తట్టినప్పుడు వచ్చే పనే నేటి మహిళా చట్టాలని పేర్కొన్నారు. అనంతరం ఇనచార్జ్‌ వైస్‌చాన్సలర్‌ పద్మ, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసరు రఘునాథరెడ్డి మాట్లాడారు. ఈ కర్యాక్రమంలో డాక్టర్‌ సీవీ వర ప్రభాకర్‌, ఎం.మమతకుమారి, డాక్టర్‌ గణేశనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:23 AM