Share News

వైవీయూలో ప్రతిభావంతులకు బంగారు పతకం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:15 AM

సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అ వార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేరిట యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతులకు బంగా రు పతకాలు ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

వైవీయూలో ప్రతిభావంతులకు బంగారు పతకం
వీసీ కృష్ణారెడ్డికి చెక్కును అందిస్తున్న కేతు విశ్వనాథరెడ్డి సతీమణి కేతు పద్మావతి, కుమారుడు శశికాంత

కడప ఎడ్యుకేషన, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అ వార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేరిట యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతులకు బంగా రు పతకాలు ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి స్మారక బంగారు పతకం పేరిట పోస్ట్‌గ్రాడ్యుయేషన తెలుగు శాఖలో ప్రతిభ చూపిన విద్యార్థికి బంగారు పతకం, నగదు బహుమతి ఇవ్వాలని ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సతీమణి కేతు పద్మావతి, కుమారుడు కేతు శశికాంత, కుమార్తెలు కె.మాధవి, కె.శిరీష కోరా రు. మంగళవారం కడప నగరం సింగపూర్‌ టౌనషిప్‌లోని కేతు విశ్వనాథరెడ్డి నివాసంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.కృష్ణారెడ్డిని, తెలుగు శాఖ అధిపతి ఆచార్య ఎం.ఎం.వినోదినిని ఆహ్వానించి చర్చించారు. అనంతరం రూ.2.50లక్షల చెక్కును అచార్య కేతు విశ్వనాథరెడ్డి సతీమణి కేతు పద్మావతి, కుమారుడు శశికాంతలు వైవీయూ వీసీకి అందించారు. ఈ సందర్భంగా ఆ చార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేతు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. తెలుగు భాషను సజీవంగా నిలపాలన్న తపన గల విశ్వనాథరెడ్డి చిరస్మరణీయుడన్నారు. ఈ నిర్ణయం వల్ల వైవీయూలో తెలుగు శాఖ విద్యార్థులు పోటీతత్వంతో చదువులు సాగించి ప్రతిభావంతులుగా తయారవుతారని ఆకాంక్షించారు. ప్రతి కాన్వకేషనలో ప్రతిభావంతులకు బంగారు పతకంతో పాటు, ప్రోత్సాహకంగా రూ.10వేల నగదు బహుమతిని అందజేస్తామన్నారు. ఆచార్య కేతు గత ఏడాది మే మాసంలో మృతిచెందిన నేపథ్యంలో ఈ పతకం ఏర్పాటు చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు శాఖ అధిపతి ఆచార్య ఎం.ఎం.వినోదిని కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 25 , 2024 | 12:15 AM