అభివృద్ధికి ఆమడ దూరంలో గొల్లపల్లె
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:46 PM
మండలంలోని రాచవేటివారిపల్లి పం చాయతి మారు మూల గ్రామమైన గొల్లపల్లె ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటోంది.
నిమ్మనపల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచవేటివారిపల్లి పం చాయతి మారు మూల గ్రామమైన గొల్లపల్లె ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటోంది. గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఇదే గ్రామంలో 1983లో టీడీపీ వ్యవస్థాపకుడు అప్పటి ముఖ్యమంత్రి నందమూరిరామారావు కాలనీని ఏర్పాటు చేసి 70 ఇళ్లను మంజూ రు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలనీకి రోడ్లుగాని కాలువలు గాని నిర్మించలేదు. అంతే కాకుండా కనీ సం విద్యుత సౌకర్యం కల్పించక పోవడంతో సొంత ఖర్చులతో కొన్ని పోల్స్‌ను ఏర్పాటు చేసుకొన్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో చాలా ఇళ్లకు కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కాగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి లేని పోని వాగ్దానాలు ఇచ్చి వారి పబ్బం గడుపుకొని మరళా తిరిగి చూడడంలేదంటున్నారు. కాగా గ్రామంలో సరైన రోడ్లులేక ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్చ పిల్లలు, గర్భిణులు, వృద్ధుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉందంటున్నారు. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామంపై చిన్న చూపు చూపుతున్నా రన్నారు. కూటమి ప్రభుత్వమైనా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నాం
దాదాపు 30ఏళ్లుగా రోడ్లు, కాలువలు, కరెంటు లేక నరకయా తన అనుభవిస్తున్నాం. ఎన్ని అర్జీలు, వినతులు సమర్పించి నా పట్టించుకొనే నాఽథుడే కరువ య్యారు. కనీసం టీడీపీ ప్రభుత్వంలోనైనా మా కష్టాలు తీరుతాయని కోరుకుంటు న్నాం.
-ఎస్.గోపాల్ గ్రామస్థుడు గొల్లపల్లె
అంధకారంలోనే జీవనం సాగిస్తున్నాం
గ్రామంలో విద్యుత సౌకర్యం సరిగాలేక అంధకా రంలోనే జీవనాన్ని నెట్టుకొటస్తున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణు లు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రోడ్లు వేయకపోవడంతో వర ్షం వచ్చినపుడు రోడ్లపై నీరు నిలిచి సమస్యలు తప్పడంలేదు.
-డి.గోపమ్మ గ్రామస్థురాలు గొల్లపల్లె