Share News

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 17 , 2024 | 11:45 PM

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
వాల్మీకి చిత్రపటానికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే

మదనపల్లె అర్బన/టౌన, అక్టోబరు 17: (ఆం ధ్రజ్యోతి) వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు. మదనపల్లె పట్టణంలో ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలను గురువా రం వైభవంగా నిర్వహించారు. ఏపీ వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక నీరుగట్టువారిపల్లె మార్కెట్‌ యార్డు ఎదుట వాల్మీకి చిత్రపటం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి పేదలకు అన్నదా నం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఎం. షాజహానబాషా తోపాటు టీడీపీ నా యకులు, బీజేపీ రాజంపేట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సాయిలోకే ష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు యల్లం పల్లె ప్రశాంత, ఆకుల కృష్ణమూర్తి, మదనపల్లె పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లె రవికుమార్‌, బీజేపీ సీనియర్‌ నేత చల్లపల్లె నరసింహురెడ్డి పాల్గొని వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంతకుముందే వాల్మీకి సంఘ నాయకులు ఎమ్మె ల్యే షాజహానబాషాను దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని, నివేదిక వచ్చిన వెంటనేసమస్య తీరుతుందన్నారు. వాల్మీకులకు అర్హత కలిగిన వారికి 200 ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వాల్మీకి వీధి సర్కిల్‌లో వాల్మీకుల కోసం కమ్మునిటీ హాల్‌ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు సుదర్శన బాబు, శంకర, ముత్తురాశి హరికృష్ణ, బొగ్గిటి కృష్ణమూర్తి, విజయమోహన, చిప్పిలి చండ్రాయప్ప, చీలకబైలు సర్పంచ ప్రభాకర్‌, మాజీ సర్పంచ రెడ్డెప్ప, పులిశ్రీనివాసులు, పూల కుంట్ల హరి, కొత్తఉడుము శంకర, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మీ పద్మావతమ్మ, రాధమ్మ, ఎమార్పీఎస్‌ నాయకుడు నరేంద్రబాబు, టీడీపీ నాయకులు నాదేళ్ల విద్యాసాగర్‌, కమలమర్రి కృష్ణ, జేసీబీ మధు, వేణు, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్‌ రామకృష్ణ, కోనభాస్కర, బీజేపీ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి, విజయభారతీ సేతు, రవికుమార్‌, కోసూరి భవానీ పాల్గొన్నారు. మదన పల్లె నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీనాయకుడు రెడ్డిసాహెబ్‌ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్‌ లోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మీనాకుమారి, నాయకులు ఖాదర్‌బాషా, ముబారక్‌ఖాన, ఈశ్వరమ్మ, సోముశే ఖర్‌, రవీంద్ర, మహబూబ్‌పీర్‌, మహమ్మద్‌అలీ, నాగరాజ, ఖాసీం, వల్లి పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో:రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహిస్తుండడంతో పలుచోట్ల అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఆర్‌.క్రిష్ణవేణి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 11:45 PM