Share News

నేతన్నకు ప్రభుత్వం చేయూత

ABN , Publish Date - Dec 17 , 2024 | 11:40 PM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక చేనేతలకు చేయూత నిస్తోంది.

నేతన్నకు ప్రభుత్వం చేయూత
మగ్గంనేయడానికి దారాలు అతికిస్తున్న చేనేత కార్మికురాలు

వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత ఫనేత కార్మికులకు తగ్గిన ఆర్థిక భారం హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

మదనపల్లె అర్బన, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక చేనేతలకు చేయూత నిస్తోంది. దీం తో చేనేత రంగంపై ఆధారపడిన నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం లో చేనేత రంగం అభివృద్దికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభు త్వం నేతన్నలకు 100లోపు యూనిట్లు ఉచిత విద్యుత పథకం అమలు చేసింది. చేనేత కార్మి కులకు జీరో విద్యుత బిల్లులు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత పొంద డానికి అర్హులైన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులకు నేతన్నలకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తుంపు కార్డు, ఆధార్‌కార్డు వంద యూనిట్ల లోపల వచ్చిన విద్యుత బిల్లు తోపాటు చేనేత కార్మికుడిగా ఉన్న ఫొటోతో కూడిన దరఖాస్తును సమీపంలోని సచివాలయం లేదా కరెంటు ఆఫీస్‌లో ఇవ్వాలి. రెండు మూడు రోజుల్లో ఆప్రాంతపు లైనమెన విచారణ చేసి అర్హులుగా గుర్తిస్తారు. గత అక్టోబరు, నవంబరు లో దరఖాస్తు చేసుకున్నవారికి విద్యుత బిల్లు జీరో రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నీరుగట్టువారిపల్లెలో చేనేత కుటుంబా లు ఐదు వేలు వరకు ఉన్నాయి. పని చేస్తున్న మగ్గాలు ఆరువేలు, ఉచితం విద్యుతకు అందించి న దరఖాస్తులు నాలుగు వేల వరకు ఉన్నాయి.

చేనేతలకు భరోసా ఇచ్చిన చంద్రబాబు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత అం దించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతన్నల కు భరోసా కల్పించారు. గతంలో కూడా టీడీపీ పాలనలో సబ్సిడీలతోపాటు ఆర్థిక సాయం, ఉచితంగా చేనేత కార్మికు లకు బియ్యం అందించారు. చేనేత భీమా, ఆదరణ పథకాలను అమలు చేసి ఆదుకున్నారు.

-గుంపు వెంకటేష్‌ ,

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు , మదనపల్లి

చేనేతలకు ఆర్థిక భారం తగ్గింది

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత హామీలను అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిం ది. దీంతో ప్రతి నెలా నేతన్నలకు ఆర్థిక భారం తగ్గనుంది. గత ప్రభుత్వంలో ఒక మగ్గానికి రూ.500పైగా కరెంటు బిల్లు చెల్లించేవారమని, అనేక కారణాలతో చేతినిండా పనిలేక కరెంటు బిల్లు చెల్లించడానికి ఇబ్బందులు పడేవారం, గత రెం డు నెలలుగా జీరో కరెంటు బిల్లు రావడంతో ఆర్థిక భారం కొంచెం తగ్గింది.

-ముష్ఠూరి రామమోహన ,

చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మదనపల్లి

Updated Date - Dec 17 , 2024 | 11:40 PM