Share News

హరహర మహాదేవ

ABN , Publish Date - Nov 04 , 2024 | 11:35 PM

కార్తీక మాసం మొదటి సోమవారం హరహర మహాదేవ అం టూ శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మా ర్మోగాయి.

 హరహర మహాదేవ
పీలేరు శివాలయంలో మహిళలతో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరింపజేస్తున్న ఆలయ అర్చకులు

కార్తీక మాస తొలి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు పరమేశ్వరుడికి అభిషేక పూజలు

విశేష అలంకరణలు

కార్తీక దీప కాంతుల వెలుగులు

పీలేరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి: కార్తీక మాసం మొదటి సోమవారం హరహర మహాదేవ అం టూ శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మా ర్మోగాయి. ఈ సందర్భంగా పీలేరులోని కాశీ విశ్వే శ్వర స్వామి ఆలయం, శివరామపురంలోని భ్రమ రాంబికా మల్లిఖార్జున స్వామి, అడవిపల్లెలోని మ ద్గుండాల మల్లేశ్వర స్వామి, జంగంపల్లెలోని వీరభ ద్ర స్వామి ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వ హించారు.. తొలి సోమవారం సంద ర్భంగా ఆయా ఆలయాల్లో ఆలయ నిర్వాహకులు స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున వేకువ జామునే ఆల యాలకు చేరుకుని స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు విరూపాక్షం కుమారస్వామి మహిళలతో కేదార గౌరీ వ్రతాన్ని ఆచరింపజేశారు. వ్రతం అనంతరం చాలా మంది మహిళలు ఆలయంలోని నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలతో సోమవారం సాయంత్రం ఆలయం దేదీప్యమానం గా వెలిగిపోయింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్దతిప్పసముద్రంలో: మండల కేంద్రమైన పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మా సం మొదటి సోమవారాన్ని పురష్కరించుకుని ఆధ్యా త్మిక వేత్త సనగరం పట్టాభిరామయ్య ఆధ్వ ర్యంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషే కం, రుద్రహోమం, పూర్ణాహుతి, మహా మంగళరతి నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో మహి ళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. ఆల యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న దానం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

కలకడలో:కలకడ కామాక్షి సమేత సిద్ధేశ్వరుడికి మొదటి కార్తీక సోమవారం రోజున అధిక సంఖ్య లో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అర్చ కుడు సుబ్రమణ్యం స్వామి ఉదయాన్నే స్వామి అమ్మవార్లను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కలికిరి, కలకడ, సం బేపల్లె మండలాల నుంచి ఆలయానికి భక్తులు హాజరై నోములలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తం గా సోమవారం కార్తీక మాసం తొలి సోమవారం గౌరీ కేదారేశ్వరస్వామి వ్రత వేడుకలను వైభవం గా నిర్వహించారు. స్థానిక కోనేటివీధి శివాల యంలో ఉదయం గౌరీ అమ్మవారికి అభిషేకం, అర్చన, విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగాయి. గౌరీ కేదారేశ్వరులకు వ్రత వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల విశేష సంఖ్య లో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్ర మాలలో ఆలయ ధర్మకర్త కువైట్‌ శంకరాచారి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా కేదారేశ్వరస్వామి నోములు

మదనపల్లె అర్బన, నవంబరు4(ఆంధ్రజ్యోతి): కార్తీ కమాస మొదటి సోమవారం సందర్భంగా పలు ఆలయాల్లో కేదారేశ్వరస్వామి నోములు వైభవం గా నిర్వహించారు. చిప్పిలిగ్రామంలోని మడికయ్య ల శివాలయంలో కేదారేశ్వరుడిని ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. అనంతరం అధిక సం ఖ్యలో మహిళలు పాల్గొని కేదారేశ్వరస్వామి నోము లు నోచారు. సీటీఎం రోడ్డులోని మంజునాథ స్వా మి ఆలయంలో, నీరుగట్లువారి పల్లెలోని నీలకం ఠేశ్వర స్వామి ఆలయంలో కేదారేశ్వరస్వామి నోములు చేశారు. అనంతరం భక్తులు స్వామివా రిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ ధర్మకర్త గుడి రామాంజులు అన్ని సౌకర్యాలు కల్పించారు.

Updated Date - Nov 04 , 2024 | 11:35 PM