ఉపాఽధి పనుల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలి
ABN , Publish Date - Oct 10 , 2024 | 11:31 PM
ఉపాధి హామీ పనుల కల్పనలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలపాల ని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి
ములకలచెరువు, అక్టోబరు 10: ఉపాధి హామీ పనుల కల్పనలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలపాల ని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు. స్థానిక సీఎల్ ఆర్‌సీ భవనంలో గురువారం నియోజకవర్గంలోని ఆరు మండలాల ఉపాధి సిబ్బందితో జరి గిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాబ్ కార్డులు ఉన్న కూలీలందరికి వంద రోజులు పనులు కల్పిస్తే తంబళ్లపల్లె నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్‌మెంట్ కింద రూ.130 కోట్లు అదనపు నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉపాధి పనులు పూర్తి స్ధాయిలో కల్పించలేదని ధ్వజమెత్తారు. ఉపాధి పథకం కింద రైతు లకు అందిస్తున్న ప్రొత్సహకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డ్వామా ఏపీడీ మధు బాబు, ఆరు మండలాల ఏపీవోలు నారాయణస్వామి, తిరుపాలప్ప, అంజనప్ప, వెంకటే శు, మురళి, మంజుల, ఇంజనీర్లు నాగరాజు, పవ నకుమార్, మహేష్, రామన్న, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.