హైందవ శంఖారావం సంఘీభావ ర్యాలీ
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:13 AM
విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా ఆదివా రం మదనపల్లె పట్టణంలో విశ్వ హిందూపరిషత ఐక్యవేదిక స భ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహిం చారు.
మదనపల్లె అర్బన, డిసెంబరు 29(ఆంద్రజ్యోతి): విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా ఆదివా రం మదనపల్లె పట్టణంలో విశ్వ హిందూపరిషత ఐక్యవేదిక స భ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహిం చారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ ప్రారం భమై దేవళం వీధిలోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా విశ్వహిం దూపరిషత ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ దేశంలోని దేవాలయాలను, హిందు వులను కాపాడుకోవడానికి విజయవాడలో జనవరి 5వ తేదీన జరిగే హైందవ శంఖా రావం బహిరంగ సభను ప్రతి ఇక్క హిందువు హాజరై తమ సత్తాను చాటాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బండిబాలాజీ, బర్నేపల్లె రవికుమా ర్, బంది ఆనంద్, వరదారెడ్డి నారథరెడ్డి, లక్ష్మీపతి, భగవాన, తదితరులు పాల్గొన్నారు.