Share News

ఈ రోడ్లపై ప్రయాణమెలా?

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:49 PM

నియోజకవర్గ కేంద్ర మైన తంబళ్లపల్లెలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.

ఈ రోడ్లపై ప్రయాణమెలా?
తంబళ్లపల్లె-కోసువారిపల్లె రోడ్డులో రెండు బావుల వద్ద దెబ్బతిన్న రోడ్డు, రోడ్డుపై ఏర్పడిన గుంతలు

తంబళ్లపల్లె నుంచి

మదనపల్లె, కోసువారిపల్లె వెళ్లే రోడ్లు గోతులమయం

ప్రమాదాల బారినపడుతున్న వాహనదారులు

పట్టించుకోని అధికారులు

తంబళ్లపల్లె, సెప్టెంబరు 29: నియోజకవర్గ కేంద్ర మైన తంబళ్లపల్లెలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గతంలో కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో.. గోతులు ఏర్పడి వాహన చోదకుల రోడ్ల మీద ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని ద్విచక్ర వాహనాలు కిందపడి వాహనచోద కులు ప్రమాదాల బారీన పడిన సంఘటనలు న్నాయి. తంబళ్లపల్లె నుంచి మదనపల్లెకు వెళ్లే రహ దారి ముదివేడు క్రాస్‌ వరకు, తంబళ్లపల్లె నుంచి కోసువారిపల్లె, ములకలచెరువుకు వెళ్లే రోడ్లు కంకర తేలిపోయి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయార య్యాయని వాహనదారులు వాపోతున్నారు.

గుంతలమయంగా కోసువారిపల్లె రోడ్డు

తంబళ్లపల్లె నుంచి కోసువారిపల్లెకు వెళ్లే రోడ్డు కంక ర తేలి అడుగడుగునా గుంతలమయంగా తయా రైంది. తంబళ్లపల్లె మండల కేంద్రం నుంచి దాదం వడ్డిపల్లె, గుండూరివారిపల్లె, జొన్న చేనుపల్లె, దేవరబురుజు, దిగువముట్రవారిపల్లె, పాపనచెరు వుపల్లె, కోసువారిపల్లె తదితర సుమారు 15 గ్రామా ల ప్రజలకు ఇదే ప్రధాన రోడ్డు. దీంతో ఈ రోడ్డుపై రోజు ఎక్కువ సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహన దారులు వివిధ పనుల నిమిత్తం తంబళ్లపల్లె మండ ల కేంద్రానికి వచ్చి వెళ్తుంటారు. ఈ రోడ్డు ఆద్యంతం గుంతలమయమవ్వడంతో ప్రయాణం సాగించాలం టే నరకం కనిపిస్తోందని వాహన చోదకులు వాపో తున్నారు. రాత్రి వేళల్లో దగ్గరకు వచ్చే వరకు గుంత లు కనిపించక అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తం బళ్లపల్లెకు సమీపంలోని బోడిబండ వద్ద, రెండు బావుల వద్ద, దాదంవడ్డిపల్లె సమీపంలో, జొన్న చేనుపల్లె బస్టాప్‌ సమీపంలో, దేవరబురుజు వద్ద తదితర ప్రాంతాల్లో రోడ్డు కంకర తేలి పెద్ద గుంత లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. అదే విధంగా తంబళ్లపల్లె-ములకలచెరువు ప్రధాన రహ దారిలో పలు చోట్ల ఽగోతులు ఏర్పడ్డాయి. తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు, కదిరి, అనంతపురం, చింతా మణి వంటి పట్టణాలకు ఈ రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉం డటంతో రోజూ ప్రయాణం సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహన దారులు వాపోతున్నారు. పలువురు వాహనదారులు కొంచెం దూరం, సమయాభావం ఎక్కువైన తంబళ్లపల్లె నుంచి గుండ్లపల్లె, వేపూరికోట క్రాస్‌ మీదుగా కదిరి హైవేలో కలుసుకుని అక్కడి నుంచి ములకలచె రువు, ఇతర పట్టణాలకు వెళుతున్నామన్నారు.

అధ్వాన్నంగా మదనపల్లె రహదారి

తంబళ్లపల్లె నుంచి మదనపల్లెకు వెళ్లే ప్రధాన రహ దారి ముదివేడు క్రాస్‌ వరకు పలు చోట్ల పెద్ద గుం తలు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. తంబళ్లపల్లె నుం చి మదనపల్లెకు నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు, లారీలు తిరుగుతూ రద్దీగా ఉంటుంది. ప్రజలు, వివిధ శాఖ ల మండల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, సిబ్బంది విధులు నిర్వహించడానికి రోజూ మద నపల్లె నుంచి తంబళ్లపల్లెకు ఈ రోడ్డు మీదనే వా హనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో కురిసిన వర్షాల ధాటికి ముదివేడు క్రాస్‌ నుంచి తం బళ్లపల్లె వరకు పలుచోట్ల రోడ్డు కంకర తేలి గోతుల మయంగా మారింది. దీనికి తోడు ఈ గోతుల్లో భారీ లారీలు, టిప్పర్లు తిరగడం తో అవి మరింత పెద్దవై బావుల్లా తయారయ్యాయి. తంబళ్లపల్లె సంతోపు వద్ద, కురవపల్లె బస్టాప్‌ వద్ద, ఎర్రసానిపల్లె పల్లె సమీపంలో మలుపు వద్ద, ఎద్దు లవారిపల్లె బస్టాప్‌ వద్ద, కన్నెమడుగు, కే.రామిగాని పల్లె సమీపంలో, దాదంవారిపల్లె వద్ద తదితర ప్రాంతాల్లో రోడ్డుపై ప్రయాణించాలంటే వాహన చోదకులు నానా అవ స్థలు పడుతున్నారు.

గుంతల రోడ్లపై ఎన్ని ప్రమాదాలో..?

గుంతలమైన రోడ్లపై వాహనాలు కిందపడి ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తంబళ్లపల్లె మం డలం ఆర్‌ఎనతాండాకు చెందిన మహేష్‌నాయక్‌, రెడ్డమ్మ దంపతుల కుమారుడు అక్షయనాయక్‌ ఈనెల14న ఆటోలో ప్రయాణిస్తూ జారి కిందపడి మృత్యువాతపడ్డాడు. వినాయకచవితి పండుగకు ఇంటికి వచ్చిన కొడుకును తిరిగి పాఠశాలలో వది లేందుకు తల్లితండ్రులు తమ ఆటోలో తీసుకు వెళ్తుండగాకురబలకోట మండలం దాదంవారిపల్లె వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో ఆటో వెళ్లడంతో తండ్రి పక్కనే కూర్చున్న కుమారుడు అక్షయ ప్రమాద వశాత్తు అదుపు తప్పి జారి కింద పడి మృతి చెందా డు. అదేవిధంగా తంబళ్లపల్లె మండలం చెన్నప్పగా రిపల్లెకు చెందిన చంద్రమోహన భార్య సుశీల గత ఏడాది ఫిబ్రవరి 11న ద్విచక్రవాహనంలో వెనుకల కూర్చొని వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా చెట్లవారిపల్లె సమీపంలో గుంతల రోడ్డుపై పట్టు తప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇకనైనా సంబంధిత అధికారులు పెద్ద ప్రమాదాలు చోటుచేసుకోక ముందే రోడ్ల మరమ్మతులు చేపట్టా లని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:49 PM