లింగాలలో హైనా కలకలం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:34 AM
లింగాలలో శుక్రవారం ఉదయం హైనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన బయన్న ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
లింగాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): లింగాలలో శుక్రవారం ఉదయం హైనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన బయన్న ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు రాగానే ఎదురుగా ఉన్న హైనా పరుగులు తీసింది. పులిపిల్లగా భావించి అందరికి పులిపిల్లను చూశానని తెలిపాడు. సమాచారం అందుకున్న ముద్దనూరు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు సంఘటన స్థలంలోని పాదముద్రలు పరిశీలించి పులిపిల్ల కాదు హైనాగా గుర్తించారు. ఆయన మాట్లాడుతూ హైనా కుక్క జాతికి చెందినది మాంసాహార జం తువు అని తెలిపారు. మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. చిన్న పిల్లల పట్ల కాస్త అప్రమత్తగా ఉండాలని సూచించారు. కర్ణపాపాయపల్లెలో కూడా గురువారం పొలంలో కనిపించిన జంతువు హైనాగా గుర్తించారు.