చినుకుపడితే.. ఇక అంతే..!
ABN , Publish Date - Oct 26 , 2024 | 11:29 PM
మండల కేంద్రమైన నిమ్మనపల్లె బస్డాండు సమీ పంలో ఉన్న కోటకిందమాలపల్లి రోడ్డు చినుకు పడితే అడుగు పెట్టాలంటేనే జనం హడలి పోతున్నారు.
నిమ్మనపల్లి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన నిమ్మనపల్లె బస్డాండు సమీ పంలో ఉన్న కోటకిందమాలపల్లి రోడ్డు చినుకు పడితే అడుగు పెట్టాలంటేనే జనం హడలి పోతున్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ పలు మార్లు స్థానిక సర్పంచకు కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం దళిత కాలనీల్లో కూడా రోడ్లువేసి ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరతున్నారు. సంబంధిత అధికారులు చొరవ చూపి కోటకిందమాలపల్లి రోడ్డును బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.