ఆశాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదు : ఏఐటీయూసీ
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:46 PM
ఆశాలకిచ్చిన హామీలు నెరవేర్చకపో తే ఉద్యమం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ హెచ్చరించారు.
కడప మారుతీనగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆశాలకిచ్చిన హామీలు నెరవేర్చకపో తే ఉద్యమం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఆశాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి గద్దెనెక్కిన అనంతరం ఆ హామీలను మరిచారన్నారు. అనంతరం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సుభాషిణి, ఎల్. శాంతి మాట్లాడారు. గత 18 సంవత్సరాలుగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సేవలందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అం దిస్తున్న పలు సంక్షేమ పథకాలను, ఆరోగ్య సూత్రాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సర్వేల రూపంలో అందుబాటులోకి తెస్తున్న ఆశాలను పాలకులు నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు 26 వేలకు పెంచాలని, రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, మెడికల్ ఉ ద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డి మాండ్ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిచే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న కరోనా, లెప్రసీ, టీబీ అలవెన్సులు ఇవ్వాలని కోరారు. ఏఎనఎం పూర్తి చేసి ఆశాలుగా సేవలందిస్తున్న వారికి ఏఎనఎంగా పదోన్నతి కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, పెన్షన రూ.10వేలు ఇవ్వాలని, 10 లక్షల ఉచిత ప్రమాదబీమా సౌకర్యం కల్పిచాలన్నారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన అధ్యక్షురాలు మరియమ్మ, ప్రధాన కార్యదర్శి కె. కల్పన, నాయకురాలు శాంతమ్మ, అమ్ములు,శోభారాణి, అనసూయమ్మ, బాలకుళాయమ్మ, బాలగంగమ్మ, శ్రీదేవి, లలిత, పద్మావతి, దేవి, సుధారాణి, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.