ఆలోచిస్తే.. జీవితం ఆనందమయం
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:56 PM
ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం ఆనందమయంగా సాగుతుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు.
ఆత్మహత్యకు పాల్పడడం హఠాత్పరిణామం కాదు సమస్యకు పరిష్కారం తోచని అయోమయ స్థితే కారణం
కలికిరి జేఎనటీయూలో ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినం సందర్భంగా మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ
కలికిరి, సెప్టెంబర్టు 10: ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం ఆనందమయంగా సాగుతుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడడం హఠాత్పరిణామం కాదని, సమస్యకు పరిష్కారం తోచకనే ఏర్పడే అయోమయ పరిస్థితులే ఇందుకు కారణమని వారన్నారు. ప్రపం చ ఆత్మహత్యల నివారణా దినం సందర్భంగా మంగళవారం కలికిరి జే ఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహిం చిన అవగాహనా సదస్సులో ఆత్మహత్యలకు పురిగొల్పే మానసిక దౌర్భ ల్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్, మానసిక వైద్యులు, జిల్లా ఎనసీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉదయ్ కిరణ్, జిల్లా రాషీ్ట్రయ బాల స్వస్థ్య కార్య క్రమ అధికారి డాక్టర్ శివప్రతాప్ నాయక్‌లు మాట్లాడుతూ ఆత్మహత్య లు ఎక్కువగా 15-20 సంవత్సరాల మధ్య వయసున్న వారు చేసుకుంటు న్నారని, ఆ పై వయసుల వారు కూడా సమస్యలపై తగిన భరోసా లభించక నిర్లిప్తతకు గురవుతున్నారని చెప్పారు. సహనం, అవ గాహన, భరోసాలతో ఆత్మహత్యలను నివారించవచ్చని తెలిపారు. రాను రాను ఆత్మహత్యల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పిరికి వారే ఆత్మహత్యకు పాల్పడుతారనేది వాస్తవం కాదని, ఆలోచనా విధానా ల్లో మార్పులు, మానసిక వత్తిడులు, ఆసరా లభించకపోవడం ప్రధాన కారణాలుగా వివరించారు. సాధారణంగా కడుపు నొప్పితో ఆత హత్య చేసుకున్నారనడం నిరాధారమైందన్నారు. ఎప్పటి నుంచో పేరుకు పోయి న వ్యతిరేక భావాలు, వాటి ప్రభావాలు అన్నీ కలగలిసి ఆత్మహత్య కు పురిగొలుపుతాయని విశదీకరించారు. ఒకసారి ఆత్మహత్యా యత్నం చేసి బతికిన వారు తరువాత సాధారణ జీవితానికి అలవాటు పడతారని గుర్తించాలని చెప్పారు. మనతో తరచూ ఆత్మహత్య ఆలోచనల గురించి సంకేతాలను పంచుకునే వారు రెండు మూడు వారాల్లోపు తప్పనిసరిగా బలవన్మరణానికి గురవుతారన్నారు. కౌన్సెలింగ్ నైపుణ్యాలు లేకపోయినా నిరాశలో కూరుకుపోయిన వారికి భరోసా కల్పించవచ్చని చెప్పారు. మానసిక వ్యాధుల సమాచారం, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబరు 14416తో టెలీ మానస్‌కు ఫోన చేసి ఉపశమనం పొందొచ్చని సూచిం చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సి పాల్ త్యాగరాజన, ఎనఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, హెల్త్ ఎడ్యుకే టర్ మహ్మద్‌రఫీ, ఎస్టీఎస్ నాగిరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోరాదు
వాల్మీకిపురం, సెప్టెంబరు 10:క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకో రాదని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్ పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వాల్మీకిపురం అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకుంటున్నారని, గెలవడం ధ్యేయం కావాలే తప్ప ప్రతి ప్రయత్నం గెలుపే కావాలని ఎక్కడా లేదన్నారు. ఈ విషయంలో ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా ఆలోచిస్తే జీవితం విలువ ఎంటో తెలుస్తుం దన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కల్పన, వైస్ ప్రిన్సిపాల్ రామలక్ష్మమ్మ, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, సలోని, కృష్ణవేణి, సింధు, ధనలక్ష్మి, శోభన, గౌతమి, రేఖ, సత్య, విద్యార్థినులు పాల్గొన్నారు.