బిక్కావాండ్లపల్లెలో రామాలయం ప్రారంభం
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:51 PM
పెద్దమండ్యం మండలం బిక్కా వాండ్లపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు.
ఫనేడు విగ్రహప్రతిష్ఠ, సీతారాముల కల్యాణం
పెద్దమండ్యం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పెద్దమండ్యం మండలం బిక్కా వాండ్లపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు. టీటీడీ ఆర్థిక సాయం, స్థానికుల సహకారంతో సుమారు రూ.10లక్షల వ్యయంతో ఆలయం నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా గోపురంతోపాటు రామలక్ష్మణుల సమేత సీత, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. విజయవాడకు చెందిన భువనేశ్వరిపీఠం పీఠాధి పతి కమ లానంద భారతీస్వామి ఆధ్వర్యం లో మూడురోజుల పాటు ప్రత్యేక కార్యక్ర మాలు, పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ గణపతి హోమం, అగ్నిహోమం, నవగ్రహ పూజ, అసో్ట్రత్తర కలసాభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం కమలా నంద భారతీస్వామి ఽథార్మికోపన్యాసం చేశారు. అలాగే శుక్రవారం పూర్ణాహు తి, విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, కలశస్థాపన, సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈవేడుకలను తిలకించడానికి బిక్కావాం డ్లపల్లె, రెడ్డివారిపల్లె, చెరువుకిందపల్లె, ఉప్పరపల్లె, పెద్దమండ్యం పరిసర గ్రామాల ప్రజలు హాజరయ్యారు.