అంతా మీ ఇష్టమేనా?
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:18 AM
ఉన్నతాధికారు ల అనుమతులు లేకుండానే ఇటీవల 56 చోట్ల ట్రాన్స పార్మర్‌లు అమర్చారు, 12 చోట్ల విద్యుతలైన్లు లాగారు. అంతా మీ ఇష్టమేనా? అని ఎంపీపీ ముద్దా వెంకటసుబ్బా రెడ్డి ట్రాన్సకో సబ్ ఇంజనీరు శివప్రసాద్‌పై ఆగ్రహం వ్య క్తం చేశారు.
ఎస్టిమేషన్లు లేకుండానే ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తారా
ట్రాన్సకో సబ్ ఇంజనీరుపై ఎంపీపీ ఆగ్రహం
పుల్లంపేట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఉన్నతాధికారు ల అనుమతులు లేకుండానే ఇటీవల 56 చోట్ల ట్రాన్స పార్మర్‌లు అమర్చారు, 12 చోట్ల విద్యుతలైన్లు లాగారు. అంతా మీ ఇష్టమేనా? అని ఎంపీపీ ముద్దా వెంకటసుబ్బా రెడ్డి ట్రాన్సకో సబ్ ఇంజనీరు శివప్రసాద్‌పై ఆగ్రహం వ్య క్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో సభా భవ నంలో పుల్లంపేట ఎంపీడీవో జయశ్రీ ఆధ్వర్యంలో మం డల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన ట్రాన్సకో సబ్‌ఇంజనీరు, మండల రెవెన్యూ అధికారిపైన ధ్వజమెత్తారు. ఎస్టిమేషన్లు వేయకుండానే ట్రాన్సఫార్మర్లు, విద్యుత లైన్లు ఏర్పాటు చేస్తారా? అంతా మీ ఇష్టమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అక్ర మంగా ఇచ్చే విద్యుత లైన్లను వాడుకుని వన్యప్రాణులను చంపేస్తున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్ర శ్నించారు. అనంతసముద్రం ఎంపీటీసీ సభ్యుడికి చెంది న స్థలం ఆక్రమణపై విచారణకు జాయింట్ కలెక్టర్ ఆదే శించినా బేఖాతరు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని సర్వే చేయాలని ఏప్రిల్ నెలలో ఓ రైతు చలానా కడితే, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ప్రశ్నించా రు. పులివెందుల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాలకు చెం దినవారు ఇక్కడ భూములు ఆక్రమిస్తుంటే ఏమి చేస్తున్నారంటూ నిలదీశారు. ఈ విషయాలపై తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్‌కు పంపాలని ఎంపీడీవోకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటరత్నమ్మ, జయశంకర్, డాక్టర్ మనోజ్‌చంద్ర, మండల కోఆప్షన సభ్యుడు సయ్యద్ ముస్తాక్ ఎంఈవో నాగతిరుమలరావు, పశు వైద్యాధికారి సుదీప్ తదితరులు పాల్గొన్నారు.