Share News

YSRCP: విద్యుత్ శాఖలో జగన్ బిగ్ స్కాం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:03 AM

అమరావతి: గత జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ శాఖను సొంత జేబు సంస్థలా మార్చుకుంది. పోస్టులను అమ్ముకునేందుకే కొన్ని సబ్‌స్టేషన్ల పనులను ప్రతిపాదించింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు పోటీపడి అవసరం లేని చోట్ల సబ్‌స్టేషన్లను మంజూరు చేయించుకున్నారు.

YSRCP: విద్యుత్ శాఖలో జగన్ బిగ్ స్కాం
YS Jagan

జగన్‌ జమానాలో.. విద్యుత్‌శాఖలో ఇదో తరహా అవినీతి

ఎంపీ అవినాష్‌ సిఫార్సు చేసినవి 68 సబ్‌స్టేషన్లు

నాటి మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించినవి 30..

గత ఐదేళ్లలో అదనంగా అనుమతించినవి 350

అమరావతి: గత జగన్‌ (Jagan) ప్రభుత్వం విద్యుత్‌ శాఖను (Electricity Department) సొంత జేబు సంస్థలా మార్చుకుంది. విద్యుత్‌ సంస్థల అవసరాలు.. నిధుల వెసులుబాటుతో సంబంధం లేకుండా సొంత లాభాలకే ప్రాధాన్యత నిచ్చింది. కమీషన్.. పోస్టులను అమ్ముకునేందుకే కొన్ని సబ్‌స్టేషన్ల పనులను ప్రతిపాదించింది. కడప జిల్లాలో ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫార్సుతో 68 సబ్‌స్టేషన్లు.. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ పరిధిలో 30 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు అనుమతించాయి. ఇదే విధంగా వైఎస్సార్‌సీపీ నేతలు పోటీపడి అవసరం లేని చోట్ల సబ్‌స్టేషన్లను మంజూరు చేయించుకున్నారు. సరైన అధ్యయనం లేకుండా మంజూరు చేసిన వాటిని గుర్తించి.. ఇప్పటికీ నిర్మాణం మొదలుపెట్టని 140 సబ్‌స్టేషన్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల ఒక్కొక్క సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సుమారు రూ. 2.5 కోట్ల చొప్పున.. డిస్కంలపై సుమారు రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గింది.


వార్షిక ప్రణాళిక తప్పింది

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా మెరుగుదల కోసం రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విద్యుత్‌ సంస్థలు అధ్యయనం చేస్తాయి. విద్యుత్‌ లోడ్‌ ఎక్కువ కావడంతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే సబ్‌స్టేషన్లను గుర్తించి వాటి సామర్థ్యం పెంచడం లేదా కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదిస్తాయి. ఈ మేరకు ‘రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళిక 2020-24’ను రూపొందించాయి. విద్యుత్‌ సంస్థల దగ్గర అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా ప్రణాళిక రూపొందించి.. వాటి అమలుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో రూ.1,891 కోట్లతో 927 సబ్‌స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటితోపాటు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సంతృప్తి పరిచేందుకు అదనంగా మరో 350 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు అనుమతించాయి. దీనివల్ల డిస్కంలు సుమారు రూ.875 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు రూ.1.12 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలకు ఇది మరింత భారంగా మారింది.


పోస్టులు.. కమీషన్ల కోసం కక్కుర్తి

గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకు.. కమీషన్ల వసూళ్లకు సబ్‌స్టేషన్లను నిర్మించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఒక్కో సబ్‌స్టేషన్‌లో నాలుగు ఆపరేటర్‌ పోస్టులను నియమించుకునే అవకాశం ఉంది. కొందరు ఎమ్మెల్యేలు ఒక్కో పోస్టును రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒక్కో సబ్‌స్టేషన్‌పై స్థానిక ఎమ్మెల్యేకు సుమారు రూ.కోటి వరకు లబ్ధి చేకూరితే..వాటి నిర్మాణానికి నిధులు వెచ్చించడం ద్వారా డిస్కంల నిర్వహణ భారం పెరిగింది. ఆ మొత్తం ఎఫ్‌పీపీసీఏ (ఇంధన సర్దుబాటు ఛార్జీలు) పేరుతో ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..

ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే..

అరబిందో ‘అత్యవసర’ అక్రమాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 30 , 2024 | 11:36 AM