Share News

జగన అవినీతే విద్యుతకు శాపం

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:01 AM

గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జగన చేసిన అవిఙనీతి వల్లే విద్యుత రంగం అస్తవ్య స్తమైందని టీడీ పీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్య దర్శి ఎర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నారు.

జగన అవినీతే విద్యుతకు శాపం
ములకలచెరువు సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

వైసీపీ కపట నాటకాలు ఎవరూ నమ్మరు బాబు పాలనలో విద్యుత చార్జీలు పెరగవు టీడీపీ నేతలు

ములకలచెరువు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జగన చేసిన అవిఙనీతి వల్లే విద్యుత రంగం అస్తవ్య స్తమైందని టీడీ పీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్య దర్శి ఎర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నారు. స్ధానిక పార్టీ కార్యాలయంలో శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు జగన విద్యు త డ్రామాలపై నిర్వహించిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ జగన ఇష్టం వచ్చినట్లు విద్యుత చార్జీలు పెంచి ఇప్పుడు ధర్నాలు చేసి ప్రజలను మోసం చేస్తు న్నాడ న్నారు. గత ఐదేళ్లలో 10 సార్లు విద్యుత చార్జీ లు పెంచి ఇప్పుడు ధర్నాల పేరుతో వైసీపీ ఆడుతున్న కపట నాటకాలు ఎవరూ నమ్మర న్నారు. గాలివీడు ఎంపీడీవోపై వైసీపీ నాయ కులు చేసిన దాడిని ఖంచించారు. ఈ సమా వేశంలో మాజీ ఎంపీపీ నరసింహులు, నాయ కులు భజంత్రి రామాంజులు, పాల రాము, సుబ్బినాయుడు, నారాయణ, రెడ్డెప్ప, భాస్కర్‌ రెడ్డి, బషీర్‌, రమణప్ప, ఫకృద్దీన, మురళి, రవ్రీంద్ర, గంగాదేవి పాల్గొన్నారు.

ఉనికి కోసమే వైసీపీ ఆందోళనలు

పీలేరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ, కేవలం తన ఉనికి కోసమే ఆందోళనలు చే స్తోందని పీలేరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పీలేరులో శనివారం విలేఖరుల సమా వేశంలో రాజంపేట పార్ల మెంటు టీడీపీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబు మాట్లాడుతూ సాధారణ ఇంటికి 2019 లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.600ల విద్యుత బిల్లులు వచ్చేవని, 2024 లో జగన ప్రభుత్వం దిగే సమయానికి అది మూడింతలు పెరిగి రూ.1800లు వస్తోందన్నా రు. ఐదేళ్ల పాలనలో ఏడుసార్లు విద్యుత ఛార్జీ లు పెంచిన ఘనత జగనదేనన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతో విద్యుత చార్జీలు పెరిగాయంటూ అబద్ధపు ఆరోపణ లు చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారన్నారు. మాజీ జడ్పీటీసీ మల్లెల రెడ్డిబాషా మాట్లాడు తూ వైసీపీ పాలనలో ఏనాడైనా ఆందోళనలు చేసుకోనిచ్చారా అని ప్రశ్నించారు. పీలేరు మం డల పార్టీ అధ్యక్షుడు వారణాశి శ్రీకాంతరెడ్డి. నాయకులు పురంరామ్మూర్తి, అమరనాథరెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, కోటపల్లె శ్రీనాథరెడ్డి, యల్లె ల రెడ్డప్ప రెడ్డి, ఆర్‌బీఐ రమణారెడ్డి, కంచి సూరి, హనీ ఫ్‌, రెడ్డిముని, రమాదేవి, షౌకత అలీ, చానబాషా, కోడి రామకృష్ణారెడ్డి, లక్ష్మీకర, నగేశ, వినోద్‌, నల్లారి రియాజ్‌, వెంకటరమణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:01 AM