Share News

జోరుగా టీడీపీలో చేరికలు

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:57 PM

మండలంలోని బొమ్మవరం గ్రామ పంచా యతీలో ఉమ్మడి అభ్యర్ధి అరవ శ్రీధర్‌, ఎంపీ అభ్యర్ధి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గెలుపుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రచారం చేశారు.

జోరుగా టీడీపీలో చేరికలు
టీడీపీలో చేరిన వారితో అరవ శ్రీధర్‌, ముక్కా వరలక్ష్మి

ఓబులవారిపల్లె, ఏప్రిల్‌ 23 : మండలంలోని బొమ్మవరం గ్రామ పంచా యతీలో ఉమ్మడి అభ్యర్ధి అరవ శ్రీధర్‌, ఎంపీ అభ్యర్ధి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గెలుపుకోసం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రచారం చేశారు. బొమ్మవరంలో టీడీపీఊ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి, ఆయన సతీమణి వరలక్ష్మి, ఆధ్వర్యంలో పెంచలయ్య, శివయ్య, వైసీపీ వైస్‌ సర్పంచ రామాంజినేయులు, సుబ్బనరసయ్య, విజయ్‌ టీడీపీ కండువా కప్పుకు న్నారు. బొమ్మవరం గ్రామానికి చెందిన బొమ్మవరం రామచంద్రా రెడ్డి, రాజారెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, సానయగారి సునీల్‌ కుమార్‌రెడ్డి, కొమ్మూరి నారాయణరెడ్డి, చక్రవర్తుల శివరాజు, అనంతరాజు వైసీపీని విడిచి టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా నాయకులు గడ్డం చంగల్‌రాజు, మాట్లాడు తూ రాష్ట్రంలో ఉమ్మడి టీడీపీ, కేంద్రంలో బీజేపీ మళ్లీ విజయం తధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో , మాజీ ఇనచార్జి కస్తూరి విశ్వనాధనాయుడు, ఉమ్మలరాజు పిచ్చిరాజు, ఉమ్మలరాజు సుబ్బరాజు, మాజీ సర్పంచ శకునాల నరసింహరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శంకర్‌రాజు, చంగల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

రాయచోటిటౌన: రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి వితననిస్సార్‌, డాక్టర్‌ సుగవాసి విద్యాధర్‌ల ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి మండిపల్లి హరితరెడ్డి సమక్షంలో మాసాపేటకు చెందిన వైసీపీ నేత, ప్రముఖ న్యాయవాది వీ. అజ్మతుల్లా మంగళవారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలు ఆనాడే తనను ఆకర్షించాయని, టీడీపీ అందించిన సుపరిపాలన ఇంకా మరువ లేకున్నానన్నారు. టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచలు దర్బార్‌బాషా, రవీంద్రనాయుడు, మాజీ కౌన్సిలర్‌ బొగ్గుల బాష, వీరభద్రస్వామి ఆలయ మాజీ చైర్మన ఎద్దుల లక్ష్మిప్రసాద్‌, తరుగు నాగరాజ, ఎస్‌. పాలకొండడదరాయుడు, నూనె లక్ష్మినారాయణ, మాసాపేట శేఖర్‌, శ్రీను, గొల్లపల్లి రవి, అల్లాబకష్‌, ఇబ్రహీం, షబ్బీర్‌ ట్రాక్టర్‌ పీరు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 10:57 PM