Share News

దశాబ్దం తరువాత భూనిర్వాసితులకు న్యాయం

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:36 PM

దశాబ్దం తరువాత గుంటివారిపల్లె ఎస్‌ఎస్‌ ట్యాంకు భూనిర్వాసితులకు న్యాయం జరి గింది.

దశాబ్దం తరువాత భూనిర్వాసితులకు న్యాయం
భూ నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

33 మంది పేదలకు ఇంటి పట్టాలు

మదనపల్లె టౌన, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):దశాబ్దం తరువాత గుంటివారిపల్లె ఎస్‌ఎస్‌ ట్యాంకు భూనిర్వాసితులకు న్యాయం జరి గింది. సమ్మర్‌స్టోరేజి ట్యాంకు నిర్మాణంతో ముంపునకు గురైన నాయనివానిపల్లె గ్రామానికి చెంది న 33 మందికి ఇంటి పట్టాలు మం జూరు చేస్తూ కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. గురువారం మదన పల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనివారిపల్లె నిర్వహించిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీ-నీవాకు అనుసంధానంగా నిర్మించిన గుంటివారిపల్లె ఎస్‌ఎస్‌ట్యాంకుతో నాయనవానిపల్లెకు చెందిన 33 మంది పేదల ఇళ్లు ముంపునకు గురయ్యాయన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు వందల సార్లు అర్జీలుపెట్టుకున్నా ఆ ప్రభుత్వ కనికరం చూపలేదన్నారు. కాని కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భూ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజి కింద ఒక్కొక్కరికి మూడు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేశామన్నారు. కొత్తగా నిర్మించనున్న కాలనికి వెళ్లే దారిలో హంద్రీ-నీవా కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఖాజాభి, టీడీపీ నాయకులు పూలకుంట్లహరి, ఎం.ప్రభాకర్‌, కత్తిలక్ష్మన్న, చంద్రశేఖర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:36 PM