్ఠరాజరాజేశ్వరిగా కన్యకామాత
ABN , Publish Date - Oct 12 , 2024 | 01:03 AM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా శుక్రవారం అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను కటాక్షించారు.
మదనపల్లె అర్బన, అక్టోబరు11:దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా శుక్రవారం అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను కటాక్షించారు. ముఖ్యంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో పట్టణం లో ని వాసవీభవన వీధిలోని కన్యకాపరమేశ్వరీ అమ్మవారిని రాజరాజే శ్వరిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం మదనపల్లె అధ్యక్షుడు ఒంప్రకాష్ ఆధ్వర్యంలో వైభవంగా చండీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు పాల్గొని కోలాటం, చెక్కభజనలు నిర్వహించారు. పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోర్టులో వెలసిన గంగమ్మను వివిధ రకాల పుష్పాలతో శోభయ మానంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో మహిళలు పూలు, పండ్లు, చీర, జాకెట్లు, పసుపు, కుంకుమలతో ఆలయా నికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. అనపగుట్ట, శ్రీవారినగర్‌లో అభయలక్ష్మీ నరసింహాస్వామికి వెండి కవచం అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవతా నగర్‌లోని రాజరాజేశ్వరీ ఆలయం లో అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు అభయమిచ్చారు. నీరుగ ట్టువారిపల్లెలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని ఆలయకమిటీ సభ్యులు వంద, 200, 500 రూపాయల నోట్లతో ధనలక్ష్మీ అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు.
నిమ్మనపల్లిలో: దసరా శరన్నవరాత్రులు సందర్భంగా నిమ్మనపల్లి పంచా యతి పెద్దమాదిగపల్లి వెలసిన మాతమ్మతల్లి ధనలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమించ్చారు. ఈ సంధర్బంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఆలయాని వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.
కురబలకోటలో: దసరాశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కన్యకా పరమేశ్వరీ అమ్మవారు రాజరాజేశ్వరిదేవీ అలంకరణలో శుక్రవారం భక్తుల కు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండల వ్యాప్తంగా శుక్రవారం దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండలం లోని గండబోయనపల్లె సత్యమ్మతల్లి ఆలయంలో, వాల్మీకిపురం కోనేటివీధి లోని కన్యకాపరమేశ్వరి ఆలయం, స్థానిక నల్లవీరగంగాభవానీ ఆలయం, గొల్లపల్లె విరూపాక్షమ్మ తల్లి ఆలయాలలో మహిషాసురమర్దిని అలంక రణలు గావించి విశేష పూజలు చేశారు. చింతపర్తి వాసవీ అమ్మవారి ఆలయంలో ధనలక్ష్మిదేవి అలంకరణలతో పూజలు నిర్వహించారు.
తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండల కేంద్రంలోని శివాలయంలో కొలువు దీరిన పార్వతీ దేవి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలల్లో బాగంగా శుక్రవారం ఆలయ చైజ్మున ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వ హించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసా దాలు స్వీకరించారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మ అమ్మవారు శుక్ర వారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడా నికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. . అలాగే గుర్రం కొండ కొత్తపేటలో కొలువైన పోలేరమ్మ ఆలయంలో అమ్మవారు కూడా మహిషాసురమర్దినిగా భక్తులను కనువిందు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
కలకడలో:మండలంలోని కోనలో కొలువైన చౌడేశ్వరి దేవి శుక్రవారం మహిషాసురమర్దినిగా భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా అమ్మవారి ని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అలంకరించారు. అలాగే కలకడ సిద్దేశ్వ ర ఆలయంలో కామాక్షి అమ్మవారిని దుర్గాదేవిగా అలం కరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రజలు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్ని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
పీలేరులో: శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పీలేరు గ్రా మ దేవత రౌద్రాల అంకాళమ్మ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తు లకు దర్శనమిచ్చింది. నెహ్రూబజారులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు మీనాక్షి దేవిగా, మోడల్ కాలనీ వద్దనున్న ఎల్లమ్మ, ఇంది రమ్మ కాలనీ వద్దనున్న దిన్నె గంగమ్మలు దుర్గా దేవి అలంకారాల్లో దర్శనమిచ్చారు. నవ మితోపాటు శుక్రవారం కావడంతో అమ్మవార్లను మహిళలు పెద్దఎత్తున దర్శించుకున్నారు. ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు.
ములకలచెరువులో: స్థానిక పీటీఎం రోడ్డులో వెలసిన వాసవీ కన్యకా పర మేశ్వరిదేవి అమ్మవారు శుక్రవారం అశ్వరుడావాహన అలంకరణలో భక్తు లకు దర్శనమిచ్చారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరిం చారు.
పెద్దతిప్పసముద్రంలో: మండల కేంద్రమైన పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భా గంగా శుక్రవారం పార్వతీ అమ్మవారిని డ్రైప్రూట్స్,పూలు, పత్రిలతో విశేషం గా అలంకరించారు. శుక్రవారం నవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. పీటీఎంతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కలికిరిలో: స్థానిక గ్రామ దేవత ఎల్లమ్మ శుక్రవారం మహిషాసుర మర్దని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా వాసవీ మాత ఆల యంలో కొలువైన కన్యకాపరమేశ్వరి అర్ధనారీశ్వరి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.