Share News

కార్మిక సంక్షేమ బోర్డును పున రుద్ధరించాలి: ఏఐటీయూసీ

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:23 PM

కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు డి మాండ్‌ చేశారు.

కార్మిక సంక్షేమ బోర్డును పున రుద్ధరించాలి: ఏఐటీయూసీ

కడప సెవెనరోడ్స్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు డి మాండ్‌ చేశారు. శనివారం కడప లేబర్‌ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌ సుప్రియకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్‌ మాట్లాడారు. 2020 నుంచి అన్ని కార్మిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల 73 రకాల షెడ్యూళ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనం అందక వేలాది రూపాయలు నష్టపోతున్నారన్నారు. భ వన నిర్మాణ కార్మికులకు వేలాది క్లెయిమ్స్‌ పరిష్కారం కా కుండా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారన్నారు. అనేక మంది కార్మికులకు పీఎఫ్‌, ఈఎ్‌సఐ అందక జీవితానికి భద్రత లేకుండా పోయిందన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కడప నగర ప్రధాన కార్యదర్శి ఉద్దిమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:23 PM