Share News

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:39 PM

మండల పరిధిలోని దేవరకొండ గుట్ట వద్ద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం దేవరకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
కల్యాణాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

పుల్లంపేట, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని దేవరకొండ గుట్ట వద్ద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం దేవరకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పెంచలకోన 6వ మహాపాదయాత్ర సందర్భంగా ఈ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో వందలాది మంది లక్ష్మీనరసింహస్వామి మాలలు ధరించారు. కల్యాణానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి భక్తులకు పందిళ్లు వేసి అందంగా అలంకరించారు. మేళతాళాల మధ్య వేదపండితులు, మంత్రోచ్చరణ చేస్తుండగా ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదికపైకి తీసుకొచ్చి శాశ్వతంగా కల్యాణాన్ని నిర్వహించారు. వందల సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాన్ని కనులారా వీక్షించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు.

Updated Date - Dec 26 , 2024 | 11:40 PM