భారతను విశ్వగురువుగా చూద్దాం
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:25 PM
భారతను విశ్వ గురువుగా చూద్దామని, ఇందుకోసం ప్రతి వ్యక్తి మనసు, శరీరం దేశభక్తితో నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గాజులపల్లి జగనమోహనరెడ్డి అన్నారు.
చెన్నూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): భారతను విశ్వ గురువుగా చూద్దామని, ఇందుకోసం ప్రతి వ్యక్తి మనసు, శరీరం దేశభక్తితో నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త గాజులపల్లి జగనమోహనరెడ్డి అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ పందేళ్ల పండుగ ఉత్సవంలో భా గంగా ఆదివానం చెన్నూరులో వందలాది మంది స్వయం సేవకులతో పట్టణ పురవీధుల్లో పథసంచలనం చేశారు. అపంతనం సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అన్నివిఽధాల అగ్రదేశమని, అలాంటి దేశాన్ని శాశ్వతంగా విశ్వగురువుగా నిలిచేందుకు ప్రతి స్వయం సేవక్ సంగ్ కృషి చేయాలన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాంతీయ కార్యవాహ్ తులసి సూర్యప్రకాశ సంఘం పాత్రను, సేవాదృక్పథాన్ని వివరించారు. సింగిల్‌విండో మాజీ ప్రెసిడెంట్ ఎన.చంద్రశేకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి, మాజీ సర్పంచలు జీఎన భాస్కర్‌రెడ్డి, పి.జయభారతరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 50 ఏళ్లుగా సంఘ సేవకు అంకితమైన సి.రామిరెడ్డి, ఆర్.శ్రీనివాసులు, పసుపులేటి సుబ్రమణ్యం, ఆకుల ప్రసాద్‌బాబు, కల్లూరు విజయభాస్కర్‌రెడ్డి, వెంకటేశ, గం గాధర్, ఆకుల చలపతి, డి.వెంకటసుబ్బయ్య, రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల వెంకటరమణ, మల్లే సుబ్బయ్య, మాదినేని రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.