సమష్టి కృషితో హరితాంధ్ర కడపగా తీర్చిదిద్దుదాం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 17 , 2024 | 11:15 PM
హరితాంధ్ర క డపగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని కడప ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు.
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 17: హరితాంధ్ర క డపగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని కడప ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం కడప శివారు ప్రాంతం నగర వనం లో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మె ల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. స్వచ్ఛతా హి సేవా కర్యాక్రమంలో భాగంగా సీఎం చంద్రబా బు హరితాంధ్ర కోసం అడుగువేద్దాం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం అనే పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం సంతోసంగా ఉందన్నారు. భవిష్యత తరాల వారికి ఒక ఆరోగ్యకర స మాజం అందించాలన్నారు. అనంతరం మాధవి త మ తల్లి లక్ష్మీనారాయణమ్మ పేరు మీద మొక్క నాటారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అటవీశాఖాధికారి సందీ్‌పరెడ్డి, వారి తల్లి పే రు మీద మొక్కలు నాటారు. డీఎఫ్‌వో గురు ప్రభాకర్, సబ్ డీఎ్‌ఫవో స్వామి, వివేకానంద మున్సిపల్ కమిషనరు వైవో నందన, అడిషనల్ కమిషనరు రాకేశ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ కడప సాధనకు కృషి చేయాలి
స్వచ్ఛ కడప సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనరు వైఓ నందన అన్నారు. మంగళవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. అలాగే స్వచ్ఛత సేవ ప్రమాణాన్ని విద్యార్థులతో చేయించారు. అనంతరం మున్సిపల్ కమిషనరు వైఓ నందన మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలు కన్న భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్, మెప్మా పీడీ సురేశ, మున్సిపల్ కార్పొరేషన అడిషనల్ కమిషనరు రాకే్‌షచంద్రం, మెప్మాసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.