సభ్యత్వంతో టీడీపీని బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:35 PM
సభ్యత్వంతో టీడీపీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి పిలుపుని చ్చారు.
చెన్నూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సభ్యత్వంతో టీడీపీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి పిలుపుని చ్చారు. ఆదివారం స్థానిక బస్టాండులో మండల కన్వీనరు సారధ్యంలో జిల్లా మైనార్టీ నేత షబ్బీర్‌హుసేన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జోరుగా సాగింది. ఈ సందర్భంగా మండల కన్వీనరు మాట్లాడుతై కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మండలానికి కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని, గత ప్రభుత్వంలో బాగుపడని ప్రతి రోడ్డును ఇప్పుడు బాగు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వీధివీధినా డ్రైనేజీలు, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. టీడీపీ సభ్యత్వం పొందిన వ్యక్తి మరణిస్తే రూ.5లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్టు తరుపున మరిన్ని పథకాలు ఆ కుటుంబానికి చెందుతాయ న్నారు. కావున ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకుని భవిష్యత్తులో బా గుపడాలని సంక్షేమ పథకాలు కూడా అందుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిఖార్జునరెడ్డి , నియోజకవర్గ ఐటీడీపీ ఆది, యువనేత క్రిష్ణకాంత, నీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, రాంబాబు, ఖదీర్, గౌస్‌పీర్, ఖాజాహుసేన పాల్గొన్నారు.