Share News

మదనపల్లె సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:41 PM

మదనపల్లె నియోజకవర్గం సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

మదనపల్లె సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం
మదనపల్లె మండలంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె నియోజకవర్గం సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. సోమవారం పల్లె పం డుగ కార్యక్రమంలో భాగంగా మదన పల్లె మండలం సీటీఎం గ్రామం నుం చి వేంపల్లె గ్రామం వరకు మొత్తం 65 సీసీ రోడ్ల పనులను రూ.4.05 కోట్ల అంచనాతో ఎమ్మెల్యే భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసిందన్నారు. మారుమూల గ్రామల్లో కూడా ప్రజలు ఇబ్బం దులు పడకుండా సీసీ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో మస్తానవలి, ఏపీవో సుబ్రమణ్యం, పీఆర్‌ ఏఈ రమణ, టీడీపీ నాయకుడు విద్యాసాగర్‌, బీజేపీ నాయకుడు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:41 PM