Share News

రహదారులకు మహర్దశ

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:31 PM

ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రహదారులకు మ హర్ద శ తీసుకొస్తోందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

రహదారులకు మహర్దశ

మదనపల్లె టౌన, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రహదారులకు మ హర్ద శ తీసుకొస్తోందని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. మదనపల్లె నియో జకవర్గంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. శనివారం మండ లంలోని పుంగనూరురోడ్డు- బొమ్మనచెరువు ను కలిపే బండకాడపల్లె రోడ్డులో మిషన పాట్‌హోల్‌ ఫ్రీ ఏపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మ తులు చేపట్టకుండా గుంతల మయం చేసి రహదారులు నరకానికి మార్గాలు గా మార్చి వేసిందని దుయ్యపట్టారు. ఐదేళ్లలో కేవలం మర మ్మతులకు తక్కువ నిధులు ఖర్చుచేశారని, దీని వల్ల చిన్నచిన్న గుంతలు వర్షాకాలంలో పెద్దగొ య్యిలుగా మారిపోయాయన్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు మిషన పాట్‌హోల్‌ ఫ్రీ కార్యక్ర మాన్ని ప్రారభించారని ఇందులో భాగంగా బండ కాడపల్లె రోడ్డులో ఉన్న గుంతలు పూడ్చడానికి ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.4.99లక్షలు మంజూరైందన్నారు. అలాగే నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, జాతీయ రహదారులపై గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ అరవిందదేవి, కాంట్రాక్టర్లు, టీడీపీ నాయ కులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని రోడ్లకు మహర్ధశ రానుందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లె జయచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ‘మిషన పాట్‌ హోల్‌ ఫ్రీ ఏపీ’(గుంతలు లేని రోడ్లు) కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కోటకొండ నుంచి కన్నెమ డుగు మఠం వరకు సుమారు 7 కి.మీ. లింకు రోడ్డుకు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు గుం తల రోడ్లలో ప్రయాణాలు సాగించలేక ప్రమాదా లకు గురై తీవ్రఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకు ‘మిషన పాట్‌ హోల్‌ ఫ్రీ ఆంధ్రప్రదేష్‌’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టి రోడ్ల రూపురేఖలు మారుస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమ న్వయ కర్త మల్లికార్జున నాయుడు, మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్‌ నాయుడు, క్లస్టర్‌ ఇనచార్జి బేరిశీన, సోముశేఖర్‌, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు రెడ్డప్ప, రామచంద్ర, గురుమూర్తి, మదన, కాలా నారాయ ణ, రేపన బాబు, ఆదిరెడ్డి, బావాజాన(ఎనఆర్‌ఐ), క్రిషా ్ణరెడ్డి, రాజేష్‌, జయరాంరెడ్డి, జగదీష్‌, అశోక్‌, నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:31 PM