‘చట్టం అందరికీ సమానమేనా’ సదస్సును విజయవంతం చేయండి
ABN , Publish Date - Dec 13 , 2024 | 11:42 PM
‘చట్టం అందరికీ సమానమేనా’ అనే అంశంపై ఈనెల 15న కడప హరిత హోటల్‌లో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరగనున్నట్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గోపాల్ పేర్కొన్నారు.
కడప మారుతీనగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘చట్టం అందరికీ సమానమేనా’ అనే అంశంపై ఈనెల 15న కడప హరిత హోటల్‌లో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరగనున్నట్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక నేరస్థులను అందలమెక్కించడం, హక్కుల కోసం ఉద్యమించే వారిపై ఉక్కుపాదం మోపండం మన దేశంలో పరిపాటిగా మారిందన్నారు. పలుకుబడి కలిగిన రాజకీయ నేరస్థులకు ఊర ట కలిగించడం కూడా అలవాటైందన్నారు. కేవలం పాలకులను ప్రశ్నించినందుకు దాదాపు 90 శాతం వికలత్వంతో చక్రాల బండికే పరిమితమైన ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ జి.ఎన సాయిబాబాను చేయని నేరానికి సుమారు 10 సంవత్సరాలు జైలులో ఉంచడం దారుణమన్నా రు. మరణశయ్యపై ఉన్న ఆయన తల్లిని చివరిచూపు చూసేందుకు కూడా నిరాకరించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో చట్టం, న్యాయం, అమలవుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తు న్న తీరు గురించి అభ్యుదయవాది ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. కావున ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు తప్పక హా జరై సదస్సును విజయవంతం చేయాలని కో రారు. సమావేశంలో సీసీఐ నాయకులు గాలి చంద్ర, నాగసుబ్బారెడ్డి, సీపీఎం నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులురెడ్డి, ఆర్సీపీ నాయకులు రవిశంకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.